కృష్ణ

అంగరంగవైభవంగా శోభనాచలుని శాంతి కళ్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగిరిపల్లి, ఫిబ్రవరి 3: ఆగిరిపల్లిలోని శ్రీశోభనాచల వ్యాఘ్ర లక్ష్మినృసింహాస్వామికి మాఘమాస రథసప్తమి తిరునాళ్ళ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శాంతి కళ్యాణం అంగరంగవైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోట్టేతారు. ఒక దశలో గాలిగోపురం వద్ద భక్తులను అదుపుచేసేందుకు పోలీసులు నానాతంటాలు పడాల్సి వచ్చింది. నృసింహనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులు ఆలయంలోని మెట్లకు పసుపు, కుంకుమలతో పూజ నిర్వహించడంతో మెట్లన్నీ బంగారు వర్ణంలో ధగధగా మెరిసిపోయాయి. కొండ కిందిభాగం నుంచి శిఖరభాగం, మూడు గుళ్ళ వద్దకు పెద్ద ఎత్తున భక్తులు స్వామి దర్శనానికి వెళ్ళిన దృశ్యం కొండ శిఖరభాగం నుండి జాలువారిన భక్తజలపాతంలా దర్శనమిచ్చింది. అన్నదాన కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఉలాస బుజ్జి, తహశీల్దార్ సిహెచ్ ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జీ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, జడ్‌పిటిసి సభ్యులు కాజా రాంబాబు, టిడిపి నాయకులు అట్లూరి రమేష్, హనుమాన్‌జంక్షన్ సిఐ జయకుమార్ స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. సుమారు 12వేల మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని మడుపల్లి వెంకటరాధాకృష్ణమూర్తి రైతు మిల్లుల యాజమాన్యం ఆధ్వర్యంలో స్వామివారి చిత్రపటాలను పంపిణీ చేయగా గరికపాటి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో భక్తులకు మంచినీళ్ళ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఇఓ జె రాంబాబు, అర్చకులు వి శేషుబాబు, వి అనంతకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తిరునాళ్ళకు భారీ బందోబస్తు
శోభనాచలస్వామి తిరునాళ్ళకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నూజివీడు డిఎస్‌పి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈబందోబస్తులో ముగ్గురు ఎస్‌ఐలు, 13 మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 27 మంది కానిస్టేబుళ్ళు, ఐదుగురు మహిళా కానిస్టేబుళ్ళు, నలుగురు హోంగార్డులు విధులు నిర్వహిస్తారని ఆయన చెప్పారు.