కృష్ణ

వేకనూరులో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఫిబ్రవరి 3: మండల పరిధిలోని వేకనూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ ఉషా, పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి విశేష అభిషేకాలు, పూజలు, శాంతి కల్యాణం, అన్నసమారాధన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. సుదర్శనం సీతారాం, తమిరిశ ఆనంద్ బ్రహ్మత్వంలో కార్యక్రమాలు జరుగ్గా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దాదాపు 10వేల మందికి అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త తుంగల వీరవసంతరావు, పాకలపాటి రామచంద్రరావు, నరసింహమూర్తి తదితరులు పర్యవేక్షించారు.
గ్రిగ్ పోటీలలో విజేతలకు అభినందనలు
అవనిగడ్డ, ఫిబ్రవరి 3: నాగాయలంక పరిషత్ హైస్కూల్‌లో జరిగిన జిల్లా స్థాయి గ్రిగ్ ఆటల పోటీలలో విజేతలైన విద్యార్థులను పలువురు అభినందించారు. స్థానిక పరిషత్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు బాల్‌బ్యాట్మింటన్‌లో రన్నర్స్‌గా, టెన్నీకాయిట్‌లో విన్నర్స్‌గా రాగా, ప్రభుత్వ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు షటిల్ బ్యాట్మింటన్ సీనియర్స్, జూనియర్స్ విభాగంలో విన్నర్స్‌గా విజయం సాధించారు. సంబంధిత విద్యార్థులను ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బంది శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు.
మహిళా సదస్సుకు మద్దతుగా 2కె వాక్
మైలవరం, ఫిబ్రవరి 3: రాజధాని అమరావతిలో ఈనెల 10 నుండి 12 వరకూ నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు మద్దతుగా ఎల్బీఆర్సీఇ ఆధ్వర్యంలో 2కె నడక కార్యక్రమాన్ని కళాశాల విద్యార్థినిలతో డైరెక్టర్ ప్రసాద్, సహేలి కన్వీనర్ య ఉమావాణి శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా కళాశాల డైరెక్టర్ విద్యార్థినిలనుద్దేశించి మాట్లాడుతూ పురుషుల కన్నా మహిళలు అన్ని రంగాలలో ఆధిక్య సాధిస్తేనే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈఈఈ విభాగాధిపతి శేషసాయి బాబు మాట్లాడారు. కార్యక్రమంలో సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థినులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఆర్ విజయ కోఆర్డినేటర్‌గా ఈకార్యక్రమాన్ని కొనసాగించారు.
బందరు వేదికగా 5వ అఖిల భారత
అంతర్ వర్సిటీల ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలు
* 15 నుండి 19 వరకు క్రీడా సంబరం
* హిందూ కళాశాలలో టోర్నీ సెల్ ప్రారంభం

మచిలీపట్నం, ఫిబ్రవరి 3: జిల్లా కేంద్రం మచిలీపట్నం హిందూ కళాశాల వేదికగా ఐదవ అఖిల భారత అంతర్ విశ్వ విద్యాలయాల ఆర్చరి ఛాంపియన్ షిప్ పోటీలు ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో 92 విశ్వ విద్యాలయాల నుండి 1020 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఐదు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. పోటీలకు అనువుగా క్రీడా మైదానాన్ని తీర్చిదిద్దే పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు ఏర్పాట్లను ప్రారంభించారు. హిందూ కళాశాల ప్రాంగణంలోనే టోర్నమెంట్ సెల్‌ను ప్రారంభించారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ టోర్నమెంట్‌ను నిర్వహించే అవకాశం కృష్ణా విశ్వ విద్యాలయానికి లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా విశ్వ విద్యాలయం ఖ్యాతిని ఇనుమడింప చేసే విధంగా ఈ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ కళాశాల కరస్పాండెంట్ డా. బి ధన్వంతరి ఆచార్య, కృష్ణా విశ్వ విద్యాలయం క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకె సుందరకృష్ణ, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఎన్ శ్రీనివాస్, టోర్నమెంట్ ఇన్‌ఛార్జ్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.