కృష్ణ

కార్పస్ ఫండ్‌తో వ్యవసాయ రంగంలో ఉత్తమ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఫిబ్రవరి 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసి రైతు సంఘాల ద్వారా సబ్సిడీ రహిత వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించి కార్పొరేట్ రంగానికి మించిన ఆదాయాన్ని ప్రభుత్వాలు సమకూర్చుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ విస్తరణ శాఖ సంచాలకుడు డా. కె రాజారెడ్డి సూచించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కృష్ణ, గుంటూరు జిల్లాలో తొలి సారిగా సాగుచేసిన మినుము పైరుకు తెగుళ్లు సోకటంతో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదేశం మేరకు గుడివాడ, మచిలీపట్నం డివిజన్‌లో శుక్రవారం రాజారెడ్డి బృందం పర్యటించింది. ఈ సందర్భంగా స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఎడిఎ ఎం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పంట నష్టపోతున్న పత్తిసాగు రైతులకు తమ ప్రయత్నం ఫలితంగా తగ్గిందన్నారు. ఆ వ్యవసాయ భూములలో శాస్తవ్రేత్తల సూచనల మేరకు మినుము సాగు చేస్తున్నారన్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాలలో 3లక్షల 29వేల హెక్టార్లలో సాగు చేసిన మినుము పంటలో 79వేల హెక్టార్లలో తొలి పంట 60శాతంపైగా దెబ్బతిందన్నారు. మొవ్వ కుళ్లు తెగులు తొలిసారిగా విస్తృతంగా వ్యాపించటంతో ముందుగా గుర్తించలేకపోయారని, లేత పంటను రక్షించేందుకు వ్యవసాయశాఖ శాస్తవ్రేత్తల ఎనిమిది బృందాలు రెండు జిల్లాలో విస్తృతంగా పర్యటించి వ్యవసాయ శాఖాధికారుల సమన్వయంతో శాస్తవ్రేత్తల సూచనలపై మందులు వాడి పంటను రక్షించుకునే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. తొలిగా వేసిన మినుము పంటలో తెగుళ్ల కారణంగా 1, 2 క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చే అవకాశం లేదని శాస్తవ్రేత్తల బృందం గుర్తించిందన్నారు. వాణిజ్య సంస్థల ప్రచారం కారణంగా విచ్చలవిడిగా పురుగు మందులు వాడటంతో తెగుళ్లు అధికమయ్యాయన్నారు. కాండం తెగులు, తలమాడు తెగులు, ఆకుముడత పై పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాల వలే గ్రామ స్థాయిలో రైతు సంఘాలను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ కార్పస్ ఫండ్ సహకారంతో సొంతంగా విత్తనాల తయారీ, ఎరువుల కొనుగోలు, వాడకం, మార్కెటింగ్ తదితర అంశాలపై శాస్తవ్రేత్తల, వ్యవసాయశాఖాధికారుల సూచనలతో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశం మేరకు తాను చైనాలో పర్యటించి గ్రహించిన అంశాలుగా పై విషయాలను ప్రభుత్వానికి నివేదిక అందచేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిటిసి కావూరి భానుమూర్తి, విస్తరణ ఉప సంచాలకులు డా. పి పున్నారావు, ఏరువాక కేంద్రం పరిశోధకులు డా. మహేశ్వరప్రసాద్, డా. కె వసంతబాను, డా. కె అచ్యుతరాజు, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం పరిశోధకులు డా. యం సత్యనారాయణ, మొవ్వ ఎఓ బి అనంతలక్ష్మి, ఎంపిఎఓలు కె రాజేష్, జెఎం చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

కోడూరులో గోడ కూలి భార్య, భర్త దుర్మరణం
నాగాయలంక, ఫిబ్రవరి 3: కోడూరు శివారు ఇస్మాయిల్‌బేగ్ పేటలో శుక్రవారం గోడ కూలిన సంఘటనలో భార్య, భర్తలు దుర్మరణం పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇస్మాయిల్‌బేగ్ పేటకు చెందిన భార్యాభర్తలు భూపతి వెంకటేశ్వర్లు(50), గంగమ్మ (47) శుక్రవారం తమ ఇంటి మరమ్మతుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. గోడ పక్కన గల రాళ్లను ఎరుతున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలి ఇరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.