కృష్ణ

పురాతన కట్టడాలను పరిశీలించిన ఆరు రాష్ట్రాల విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 4: జిల్లా స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో రీజినల్ కబ్స్ అండ్ బుల్‌బుల్స్ ఉత్సవంలో భాగంగా శనివారం బందరు కోటలోని డచ్ కోట, గంట స్తంభం, ఆయుధాలు నిల్వ ఉంచే ప్రదేశము, తుఫాను స్థూపం, చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామి ఆలయం, ఇంగ్లీషు చర్చి తదితర ప్రాంతాలను ఆరు రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ఇన్‌టాక్ కన్వీనర్ డా. ఉడత్తు శ్రీనివాసరావు పై విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం గిలకలదిండిలోని షిప్పింగ్ హార్బర్‌ను కూడా చూపించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కరింశెట్టి కైలాసపతి, కాలేజి కరస్పాండెంటు కొత్తగుండు రమేష్, ఉదయగిరి ఆంజనేయులు, 220 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బంటుమిల్లికి చేరిన కళాజాత బృందం
బంటుమిల్లి, ఫిబ్రవరి 4: రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విజయవాడ, జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం సంయుక్తంగా జనవరి 30 నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జిల్లాలో జరుపుతున్న కళాజాత శనివారం బంటుమిల్లి గ్రామం చేరుకుంది. గ్రామ పంచాయతీ వద్ద హెచ్‌ఐవి-ఎయిడ్స్, రక్తదానం, క్షయవ్యాధి, కుష్ఠువ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇల్లూరి పద్మజ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఎన్జీఓలు, కళాకారులు ఎం శేఖరబాబు, విఎస్‌ఆర్ కృష్ణ, వై రాజు, కుమార్, శ్రీశైలం, సుజాత తదితరులు పాల్గొన్నారు.