కృష్ణ

6న చల్లపల్లిలో మహిళా ప్రభంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, ఫిబ్రవరి 4: అమరావతిలో జరిగే జాతీయ మహిళా కాన్ఫరెన్స్‌ను పురస్కరించుకుని ఈనెల 6వ తేదీ సోమవారం ఉదయం చల్లపల్లిలో మహిళా ప్రభంజనం నిర్వహించనున్నట్లు రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం వివిధ శాఖల అధికారులు, విద్యా సంస్థల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా, వెలుగు, ఉపాధి హామీ పథకం, అంగన్‌వాడీ, రెవెన్యూ, పంచాయతీ, వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థినులు దాదాపు 6వేల మందితో పురవీధులలో భారీ ర్యాలీ అనంతరం ప్రధాన కూడలిలో సభ జరుగుతుందన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసే మహిళా సదస్సు ప్రపంచ మహిళా లోకాన్ని ఆకర్షించే స్థాయిలో ఉంటుందన్నారు. సన్‌ఫ్లవర్ గ్రూఫ్ చైర్మన్ యండివిఎస్‌ఆర్ పున్నం రాజు, ఎంపిపి యార్లగడ్డ సోమశేఖరప్రసాద్, జెడ్పీటిసి కృష్ణకుమారి, డిఎస్పీ సయ్యద్ ఖాదర్ భాషా, ఎంపిడిఓ పి వెంకటేశ్వరరావు, తహశీల్దార్ బి బిక్షారావు, సర్పంచ్ పద్మావతి, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు, వెలుగు సిసిలు తదితరులు పాల్గొన్నారు.
హామీలను విస్మరించి గాలిలో మేడలు కడుతున్న చంద్రబాబు

మైలవరం, ఫిబ్రవరి 4: ఎన్నికల హామీలను విస్మరించి గాలిలో మేడలు కడుతూ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన మండలంలోని చంద్రాలలో విస్తృతంగా పర్యటించి ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో అమాయకులైన, భూమినే నమ్ముకుని జీవిస్తున్న రైతులనుండి అక్రమంగా భూములు లాక్కున్నారని ధ్వజమెత్తారు. రాజధానికి అన్ని వేల ఎకరాల భూమి అవసరమా అని ఆయన ప్రశ్నించారు. పేదలనుండి భూము లాక్కుని పరిశ్రమల స్థాపన పేరుతో భూస్వాములకు, పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టి పేదల నోట్లో మట్టి కొడుతున్నాడని ధ్వజమెత్తారు. బాబు వస్తే జాబు అని, నిరుద్యోగ భృతి అని హామీలిచ్చి వాటిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. డ్వాక్రా, రైతు రుణ మాఫీల అమలులో పూర్తిగా విఫలమయ్యారన్నారు. బాబుకు బుద్ధి చెప్పేరోజు రానుందని ఆయన జోస్యం చెప్పారు. ఈకార్యక్రమంలో పార్టీ నేతలు పామర్తి శ్రీనివాసరావు, జొన్నలగడ్డ గంగాధరరావు, కాళేశు, రవిబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సెంట్రల్ జోన్ ఖోఖోలో నిడుమోలు విద్యార్థుల ప్రతిభ
కూచిపూడి, ఫిబ్రవరి 4: సెంట్రల్ జోన్ ఖోఖో పోటీలలో నిడుమోలు జెడ్పీ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారని హెచ్‌ఎం అన్నపూర్ణ శనివారం తెలిపారు. ఈనెల 1, 2 తేదీలలో ఉయ్యూరులో జరిగిన సెంట్రల్ జోన్ ఖోఖో పోటీలలో 12 మంది క్రీడాకారుల బృందం కనబర్చిన ప్రతిభా పాటవాలతో ప్రథమ స్థానంలో నిలిచారు. విజేతలైన విద్యార్థులు, శిక్షణ ఇచ్చిన పిడి పాండురంగారావులను శనివారం నిర్వహించిన కార్యక్రమంలో హెచ్‌ఎం అన్నపూర్ణ, సర్పంచ్ చిన్నం రత్నాబాయ్, ఎంపిటిసి గొంతుపులి రాము అభినందించారు.