కృష్ణ

చంద్రబాబులా నేను ఎవరి కాళ్లూ పట్టుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, ఫిబ్రవరి 5:స్వలాభం కోసమైనా, పరలాభం కోసమైనా రాష్టమ్రుఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులా నేను ఏవరికాళ్ళు పట్టుకోలేదని,తన ఉద్యమం వెనుక ఏవరూలేరని కాపుఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న కాపు నేత దాసరి నారాయణరావును పరామర్శించిన అనంతరం స్వగ్రామానికి వెళ్ళుతున్న ముద్రగడ ఆదివారం హనుమాన్ జంక్షన్‌లో కొద్దిసేపు ఆగారు. గన్నవరం నియోజకవర్గ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డా దుట్టా రామచంద్రరావు, జిల్లాకాంగ్రెస్ పార్టీనాయకులు, కాపునేత చలమలశెట్టి రమేష్‌బాబుల నివాసాలకు అయన వెళ్ళారు. వారి ఇద్దరితో ముద్రగడ కొంతసేపు మంతనాలు జరిపారు. హనుమాన్ జంక్షన్‌కు వచ్చిన ముద్రగడకు కాపునేతలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. దుట్టా నివాసంలో విలేఖర్ల సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ ఎన్నిక పాదయాత్రలో చంద్రబాబు హామీలను అమలుచేయమని 12 నెలలుగా పోరాటం చేస్తున్నామని వివరించారు. గత 25 సంవత్సరాలుగా ఎటువంటి అశలు లేకుండా వున్న కాపు జాతికి న్యాయం చేస్తానని చంద్రబాబు చెప్పడంతోనే కాపులు రోడ్లపైకి వచ్చారని పేర్కొన్నారు.కాపుజాతికి న్యాయం జరుగుతుందనే టిడిపి అండగా ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషిచేసిందని ముద్రగడ తెలిపారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకోని కాపులను తిట్టించారని, కోట్టించారని ఆరోపించారు. కాపులపై అసత్యప్రచారాలు, తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని ఘటనలో కాపుల ప్రమేయం లేదని, నమోదు చేసిన కేసులను త్వరిగతిన విచారణచేసి ప్రజలకు వాస్తవాలను తెలియాజేయాలని ముద్రగడ కోరారు. కాపులది తప్పుఅని తెలితే కోర్టు తీర్పులకు కాపుజాతి లోబడి వుంటుందని హామీఇచ్చారు. కమిషన్ల పేరుతోప్రభుత్వం కాలయాపన చేస్తోందని, తెలంగాణాలో చేపట్టిన పల్స్ సర్వే కేవలం 30 రోజుల్లో పూర్తిచేస్తే ఆంధ్రలో సమగ్ర సర్వే ఇప్పటి వరకు పూర్తికాలేదని చెప్పారు.కాపుజాతి కోసం తన వెనుక వైకాపా అధినేత జగన్, మరికొందరు వున్నారని ప్రభుత్వం ప్రచారం చేయడం సరికాదన్నారు. తనకు చంద్రబాబులా ఇతరపార్టీల నాయకుల అవసరం లేదన్నారు. ఈనెల 9,10,13న ప్రకాశం, గుంటూరు, కృష్ణాజిల్లాల్లో మంజునాధ కమిషన్ పర్యటన వుందని, 13 తర్వాత రాష్టస్ధ్రాయి కాపునేతలతో చర్చించి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ముద్రగడ అవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏక్కడ ఏ రాజకీయానాయకుడు పాదయాత్రలకు అనుమతి తీసుకోలేదని,కాపుజాతి కోసం తలపెట్టిన పాదయాత్రకు మాత్రం అనుమతికావాలని కోరడం చంద్రబాబు సర్కారుకే చెల్లిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెదపాడు,బాపులపాడు మండలాలకు చెందిన కాపునాయకులు పాల్గొన్నారు.