కృష్ణ

ఐదవ రోజూ అందని రేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఫిబ్రవరి 5: మొవ్వ మండలంలోని రేషన్ దుకాణాలలో ఐదవ రోజు ఆదివారం కూడా సర్వర్లు మొరాయించటం, బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ లింకేజిలు సక్రమంగా లేకపోవటంతో రేషన్ కార్డు దారులు గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలోని 38 రేషన్ దుకాణాలలో 17,496 రేషన్ కార్డులలో 45.69శాతం కార్డులకు మాత్రమే రేషన్ సరఫరా చేసినట్లు ఆర్‌ఐ ఎ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. వేలిముద్రలు సక్రమంగా పడకపోవటంతో పలువురికి రేషన్ అందని పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోతున్నారు. ఏది ఏమైనా గతంలో 5వ తేదీ నాటికే నూరుశాతం రేషన్ సరఫరా చేసిన డీలర్లు ఈ విడత కనీసం 50శాతం కూడా చేయకపోవటంతో వృద్ధులు, ప్రత్యేక అవసరాలు గల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్‌లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువ ఇంజనీర్‌కి కన్నీటి వీడ్కోలు

అవనిగడ్డ, ఫిబ్రవరి 5: వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అవనిగడ్డ మండలం అశ్వరావుపాలేనికి చెందిన యువ ఇంజనీర్ నీలా రామకృష్ణ (28) మృతి ఈ ప్రాంత వాసులను శోకసంద్రంలో ముంచెత్తింది. రామకృష్ణ మృతితో స్వగ్రామమైన అశ్వరావుపాలెంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. అశ్వరావుపాలేనికి చెందిన రామకృష్ణ ఖమ్మంలో మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. మిత్రులతో కలిసి శుక్రవారం వరంగల్‌లోని తన స్నేహితుడి వివాహానికి వెళ్లిన రామకృష్ణ నర్సింహంపేట మండలం పడమటిగూడెం సమీపంలో అర్ధరాత్రి 12గంటల సమయంలో ఎదురుగా వస్తున్న ఐరన్ లోడ్‌తో ఉన్న లారీని ఢీకొనటంతో రామకృష్ణతోపాటు నంద్యాలకు చెందిన మిత్రుడు పువ్వాడ శ్రావణ శివ కుమార్ అక్కడిక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం శనివారం అర్ధరాత్రి రామకృష్ణ భౌతికకాయాన్ని స్వగ్రామమైన అశ్వరావుపాలెం తీసుకు వచ్చారు. ఆదివారం కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం రామకృష్ణ మరదలు సీమంతం జరగాల్సి ఉంది. ఆ కార్యక్రమం నిమిత్తం ఆదివారం రామకృష్ణ అశ్వరావుపాలెం రావల్సి ఉండగా శవమై రావడాన్ని బంధుమిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఎంతో కష్టపడి ఇంజనీర్ చదివిన మృతుడు రామకృష్ణ తండ్రి వీరాస్వామి నాలుగేళ్ల కిందట మృతి చెందగా ఆ కుటుంబానికి అతనే పెద్ద దిక్కు అయ్యాయి. ఆ దిక్కుని కూడా మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించడం బాధాకరం. జెడ్పీటిసి కె వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కొండవీటి మస్తాన్‌రావు, పిఎసిఎస్ అధ్యక్షుడు మాదివాడ వెంకటేశ్వరరావు, విద్యానికేతన్ వ్యవస్థాపకులు పి లంకమ్మ ప్రసాద్ మృతదేహాన్ని దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.