కృష్ణ

ఉత్సాహభరితంగా ‘హ్యాపీ సండే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 5: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆదివారం నిర్వహించిన ‘హ్యాపీ సండే’ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. మచిలీపట్నం పురపాలక సంఘం ఆధ్వర్యంలో కోనేరుసెంటరులో తొలిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఉదయం 7గంటల నుండి 9గంటల వరకు పట్టణంలోని పలు విద్యా సంస్థల విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. నిత్యం రద్దీగా ఉండే కోనేరుసెంటరు విద్యార్థులకు క్రీడా మైదానంగా మారింది. ఆటపాటలతో సందడి వాతావరణం నెలకొంది. మరుగున పడుతున్న సంప్రదాయ క్రీడలకు మచిలీపట్నం వేదికగా మారింది. యువతీ యువకులతో పాటు పెద్దలు కూడా హ్యాపీ సండే కార్యక్రమాల్లో పాలు పంచుకుని ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. పురపాలక సంఘంతో పాటు బందరు బంధువుల ఆధ్వర్యంలో సంప్రదాయ క్రీడలైన గోలీలాట, గోడుం బిళ్ల, బంగరాలాటలతో పాటు జాతీయ క్రీడ హాకీ, షటిల్స్, టెన్నికాయిట్, క్రికెట్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (మడ) వైస్ చైర్మన్ ఎం వేణుగోపాలరెడ్డి ముఖ్య అతిథిగా యువతనుద్దేశించి ప్రసంగించారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకత, శక్తియుక్తులను వెలికి తీసేందుకు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ప్రతి నెలా మొదటి ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పురపాలక సంఘ కమిషనర్ జస్వంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నారగాని ఆంజనేయ ప్రసాద్, కొట్టె వెంకట్రావ్, బత్తిన దాస్‌తో పాటు పురపాలక సంఘ అధికారులు, బందరు బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.