కృష్ణ

నిమ్మకూరులో బాలకృష్ణ, లోకేష్‌లకు బ్రహ్మరథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, ఫిబ్రవరి 6: ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు సోమవారం వచ్చిన ప్రముఖ సినీ నటుడు, హిందూపురం నియోజకవర్గ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. నిమ్మకూరు అడ్డరోడ్డు నుండి సభా వేదిక వరకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. జై బాలయ్య.. కాబోయే మినిష్టర్ లోకేష్.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇరువురు నేతలతో కరచాలనం చేసేందుకు అభిమానులు ఎగబడ్డారు. భారీ ఊరేగింపుగా వచ్చిన బాలకృష్ణ, లోకేష్ తొలుత దళితవాడలోని భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే గ్రామంలోని ఎన్టీ రామారావు, బసవ తారకం నిలువెత్తు కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రి నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమిపూజ చేశారు. సభానంతరం గ్రామస్థుల పౌర సన్మానం అందుకున్నారు. ఈ సందర్భంగా వారు తమపై గ్రామస్థులు చూపిస్తున్న అభిమానాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. తమ పుట్టుకకు కారణమైన నిమ్మకూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని గ్రామస్థుల హర్షధ్వానాల మధ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో పాటు జెడ్పీటిసి పొట్లూరి శశి, ఎంపిపి దగ్గుపాటి ఉషా, మార్కెట్ యార్డు చైర్మన్ మందపాక శంకరబాబు, సర్పంచ్ జంపాన వెంకటేశ్వరరావు, ఎంపిటిసి కుద్దూస్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ సీతాపతి, గుడివాడ, మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్లు యలవర్తి శ్రీనివాసరావు, మోటమర్రి బాబా ప్రసాద్, పామర్రు మండల టిడిపి అధ్యక్షుడు కుదరవల్లి ప్రవీణ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు గొట్టిపాటి లక్ష్మీదాస్, బిసి సంఘ నాయకుడు దాలిపర్తి ప్రసాద్, బాలకృష్ణ సమీప బంధువు, నిమ్మకూరు ఉప సర్పంచ్ నందమూరి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

లోపభూయిష్ఠంగా పోర్టు భూముల ఎంజాయ్‌మెంట్ సర్వే
* రీ సర్వే జరపాలంటూ మడ విసిని కోరిన వైసిపి నేత పేర్ని నాని

మచిలీపట్నం, ఫిబ్రవరి 6: పోర్టు ప్రతిపాదిత గ్రామమైన కరగ్రహారం గ్రామంలో ఇటీవల మడ అధికారులు నిర్వహించిన ఎంజాయ్‌మెంట్ సర్వే లోపభూయిష్టంగా జరిగిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కరగ్రహారం గ్రామ బాధిత రైతులతో కలిసి మడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన ఎంజాయ్‌మెంట్ సర్వేలో మడ డెప్యూటీ కలెక్టర్లు అధికార పార్టీ చెప్పిన వారి పేర్లతో నివేదికలు తయారు చేశారన్నారు. ఫలితంగా వాస్తవ అనుభవదారులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బొర్రా విఠల్, శొంఠి ఫరీద్, కాగిత అమ్మయ్య, కరగ్రహారం గ్రామస్థులు పాల్గొన్నారు.