కృష్ణ

ఖాళీ పోస్టుల భర్తీకి డిఎంహెచ్‌వో చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 7: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు డిఎంహెచ్‌వో చర్యలు తీసుకోవాలని కోరుతూ అభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది. స్థానిక పిహెచ్‌సీలో అభివృద్ధి కమిటీ చైర్మన్ కనగాల వెంకట సత్యనారాయణ(చంటి) అధ్యక్షతన మంగళవారం కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. నాలుగు ఎఎన్‌ఎం, రెండు ఔట్ సోర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో కొన్ని సెంటర్లలో వైద్యసేవలకు ఇతర సిబ్బందిని వినియోగిస్తున్నట్టు డాక్టర్ గోపాలనాయక్ సభ్యులకు తెలియజేశారు. పీహెచ్‌సీలో పాతజీపు పాడైపోయిందని, దాని స్థానంలో కొత్తజీపుని అందించాలని, అలాగే కరకట్టపై తరుచుగా ప్రమాదాలు జరుగుతుండటంతో ఉయ్యూరు నుంచి అంబులెన్స్ వచ్చేలోపు క్షతగాత్రుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని, అందువల్ల పీహెచ్‌సీకి 108 అంబులెన్స్‌ని కేటాయించాలని తీర్మానం చేశారు. అలాగే పీహెచ్‌సీలో ఆయూష్ వైద్యసేవలు అందటం లేదని, ఆయుర్వేద డాక్టర్‌ని నియమించాలని కోరుతూ మరొక తీర్మానం చేసి ఏలూరు ఆర్‌డిడికి పంపుతున్నట్టు చైర్మన్ వెంకటసత్యనారాయణ తెలిపారు. పీహెచ్‌సీలో గతేడాది నిధులు రూ.28,933 నిల్వ ఉన్నాయని, 2016-17 సంవత్సరానికి సంబంధించిన అభివృద్ధి నిధులు రావలసి ఉందని డాక్టర్ తెలిపారు. పాత భవనాలు తొలగింపునకు నిర్వహించిన వేలంపాటలో వచ్చిన రూ.1,09,800 అలాగే ఉన్నాయని తెలిపారు. సమావేశంలో సభ్యులు మాకినేని దశరథరామయ్య, కొల్లా సాంబశివరావు, సీనియర్ అసిస్టెంట్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

వీరమ్మ తిరునాళ్లలో అపశ్రుతి
* చెరువులోపడి రెండేళ్ల బాలుడి మృతి
ఉయ్యూరు, ఫిబ్రవరి 7: వీరమ్మతల్లి తిరునాళ్ళలో మంగళవారం అపశృతి నెలకొంది. వీరమ్మ చెరువులో పడి రెండేళ్ళ బాలుడు మృతి చెందాడు. పోలీసు కథనం ప్రకారం విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన గ్రంధి కళ్యాణ్, బుల్లెమ్మ దంపతులు తమ రెండేళ్ళ కుమారుడు గ్రంధి సుశాంత్‌తో పాటు తిరునాళ్ళ సంబరాలలో పాల్గొనేందుకు వచ్చారు. వీరమ్మతల్లి దేవాలయం వద్ద అమ్మవారి రాకకోసం వేచి ఉన్న వారు చెరువు సమీపంలో వేచి ఉన్నారు. చంకలో ఉండవలసిన పిల్లాడిని కిందకు దింపడం, వారు పరధ్యానంలోకి వెళ్ళడంతో బుడి బుడి నడకలతో ఆ పిల్లాడు చెరువు మెట్లు దిగాడు. అనంతరం నీటిలో మునిగి పోయిన సుశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం గమనించిన తల్లి దండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు పోష్టుమార్టం నిమిత్తం పంపి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.