కృష్ణ

డోకిపర్రు వెంకన్నకు బంగారు పాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 10: మండల పరిధిలోని డోకిపర్రు గ్రామంలో వేంచేసియున్న శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మచిలీపట్నంకు చెందిన ఓ భక్తుడు శుక్రవారం బంగారు పాదాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆ భక్తుడు మాట్లాడుతూ కోరికన కోర్కెలు తీర్చే స్వామివారికి భక్తితో ఈ బంగారు పాదాలను సమర్పిస్తున్నానన్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డిలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దాతల పేరిట స్వామివారికి ప్రత్యేక పూజలను వేద పండితులు నిర్వహించి స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
మండల వ్యాప్తంగా విద్యుత్ విజిలెన్స్ తనిఖీలు
1546 విద్యుత్ మీటర్ల ఆకస్మిక తనిఖీ
- విజిలెన్స్ డీఈ వెంకటకృష్ణ పర్యవేక్షణ

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 10: మండలంలో శుక్రవారం విద్యుత్ మీటర్ల ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ఉయ్యూరు, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, ఘంటసాల, కోడూరు మండలాల నుంచి 50 మంది విద్యుత్ సిబ్బంది రాగా విజిలెన్స్ డీఈ కె వెంకటకృష్ణ ఆధ్వర్యంలో మీటర్ల తనిఖీలు చేపట్టారు. ఒక్కో ఏరియాకు ఇద్దరు చొప్పున 25 టీంలు ఉదయం నుంచి సాయంత్రం వరకు 16 గ్రామాలలో 1566 మీటర్లను తనిఖీ చేయగా 53 సర్వీసులకు అదనపులోడు ఉన్నట్టు గుర్తించారని వెంకటకృష్ణ తెలిపారు. ఈ అదనపు లోడు సర్వీసులకు వినియోగదారులకు నోటీసులు అందజేసి రూ.లక్ష 9వేలు రాబడతామని తెలిపారు. ఇంకా ఉయ్యూరు డీఈ టి వెంకటేశ్వరరావు, ఏడిఈ జి వెంకటేశ్వర్లు, మండల ఏఈ రమేష్‌బాబు పర్యవేక్షణ చేశారు.