కృష్ణ

వైభవంగా మువ్వ వేణుగోపాలుని కల్యాణోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఫిబ్రవరి 10: తన పదాలతో మువ్వ గోపాలుడిని కొలచిన పద కవితా పితామహుడు క్షేత్రయ్య పదాలను సామాన్య జనంలోకి తీసుకువెళ్లి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేక ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ సూర్యకుమారి పేర్కొన్నారు. మొవ్వ గ్రామంలో వేంచేసిన శ్రీ మువ్వ వేణుగోపాల స్వామి కల్యాణోత్సవాలలో సూర్యకుమారి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ సిద్ధేంద్ర విరచిత కూచిపూడి నాట్యానికి వనె్న తెచ్చిన నారాయణ తీర్థుల తరంగాలు, క్షేత్రయ్య పదాలను కలిపి ఒకటే ప్రాజెక్టు కింద ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ వేసవి నుండి ఏటా ఔత్సాహిక యువతకు, విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించి సామాన్య ప్రజలకు వీటి ప్రాచుర్యాన్ని అర్థమయ్యే రీతిలో వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఇఓ శ్రవణం అచ్యుతరామయ్య దంపతులు, గ్రామ సర్పంచ్ తాతినేని పిచ్చేశ్వరరావు, మాజీ ఎంపిటిసి మండవ బాలాత్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామోత్సవంలో సూర్యకుమారి స్వామివారి పల్లకీమోశారు. ఆలయ అర్చకులు దీవి సీతారామ హనుమాన్, వంశీమోహన్ పర్యవేక్షణలో వైఎల్‌ఎన్ ఆచార్యుల బ్రహ్మత్వంలో కల్యాణోత్సవం అనంతరం నిత్యహోమం, బలిహరణ, సహస్రదీపోత్సవం, పుష్పయాగాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మినుము పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
బంటుమిల్లి, ఫిబ్రవరి 10: ప్రస్తుతం మినుము పైరు వైరస్ తెగుళ్లతో మాడిపోతున్నాయని, రైతులు ఆందోళన చెందుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకుడు గౌరిశెట్టి నాగేశ్వరరావు, లంకదాసుల అజయ్ ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రైతు సంఘం నాయకులు బంటుమిల్లిలో తెగుళ్లతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దెబ్బతిన్న పంటలను కాపాడుకోవటానికి నానా తంటాలు పడుతున్నారని, పురుగు మందులు, కౌలు ఇతర ఖర్చులు ఎకరాకు రూ.25వేలు ఖర్చులు అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే లేత పంటను కాపాడుకోవటానికి పురుగు, తెగుళ్ల మందులను ఉచితంగా అందచేయాలని, పోయిన పంటకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు సుజ్ఞానం నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.