కృష్ణ

కమనీయం వేణుగోపాలుని కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 10: కోడూ రు మండలం హంసలదీవి లో వేంచేసియున్న శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కల్యాణం గురువారం అర్ధరాత్రి అత్యంత కమనీయం గా జరిగింది. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దత్తత ఆలయమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ బ్ర హ్మోత్సవాలు గత మూడు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి 11గంటలకు ప్రారంభమైన స్వామి కల్యాణోత్సవం అర్ధరాత్రి 2గంటల వరకు కొనసాగింది. స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వేద పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామికల్యాణం వైభవోపేతంగా జరిగింది. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పిఆర్‌ఓ అచ్యుతరామయ్య, గుంటూరు జిల్లా అనంతవరానికి చెందిన కుప్పా రామగోపాల సోమయాజీ దంపతులు స్వామి కల్యాణాన్ని జరిపించారు. టిటిడి వేద పాఠశాల ప్రిన్సిపాల్ కుప్పా సుబ్రహ్మణ్య అవధాని వ్యాఖ్యాతగా వ్యవహరించగా ప్రధాన అర్చకులు దివి శ్రీరంగాచార్యు లు, నందకుమార్ స్వామివారి కల్యాణ తంతు నిర్వహించారు. సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారి కల్యా ణ మహోత్సవంలో పాల్గొని పరవశించారు. శుక్రవారం సాయంత్రం స్వామి రథోత్సవాన్ని గ్రామ వీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.