కృష్ణ

వైభవంగా ముగిసిన శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య సప్తాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఫిబ్రవరి 13: స్థానిక అగ్రహారంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య సప్తాహాలు సోమవారం వైభవంగా ముగిశాయి. ఈనెల 7వ తేదీన స్థానిక శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళావేదికపై ప్రారంభించిన ఈ కార్యక్రమాలు ముగింపు రోజైన సోమవారం ఖమ్మంకు చెందిన భాగవతుల మానస, ఒట్టి సాయి రాధిక తెలంగాణలో ప్రాముఖ్యత గాంచిన పేరిణి లాస్యనర్తనాన్ని ప్రదర్శించడంతో ఆంధ్ర, తెలంగాణ ఏకమేనని తెలియజెప్పాయి. తదుపరి విజయవాడకు చెందిన చదలవాడ వెంకట శివరామకృష్ణ ఆనంద్, లలిత కుమారి శిష్య బృందం కావేరి, ప్రవల్లిక, వౌనిక, వైష్ణవి, రోహిత్ వర్మ, నాగ పద్మ, విజయలక్ష్మి, జయలక్ష్మి తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులకు తీపి గుర్తులను పంచిపెట్టారు.
కాపు మహిళల అభ్యున్నతికే ఉపాధి శిక్షణ
పామర్రు, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో కాపు కుటుంబాలలోని మహిళల అభ్యున్నతి కోసం పేద మహిళలకు ఉపాధి శిక్షణా శిబిరాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య పేర్కొన్నారు. పామర్రు మండలం నిమ్మకూరులోని ప్రభుత్వ మహిళా ప్రాంగణంలో కాపు మహిళలకు ఏర్పాటు చేసిన చేతి వృత్తుల ఉపాధి శిక్షణా శిబిరాన్ని సోమవారం రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పంచుమర్తి అనూరాధతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చలమలశెట్టి మాట్లాడుతూ మూడు నెలలకు 40 మంది చొప్పున కంప్యూటర్, అల్లికలు, కుట్టు శిక్షణ, మెకానిజం తదితర కోర్సులలో శిక్షణ ఇచ్చి వ్యాపారానికి రుణాలను మంజూరు చేస్తామన్నారు. విదేశాలలో ఉన్నత విద్యకై కాపు విద్యార్థులకు కార్పొరేషన్ ద్వారా రూ.10లక్షల సబ్సిడీతో రూ.20లక్షల రుణం ఇస్తామన్నారు. పరిశ్రమల స్థాపనకు సబ్సిడీతో రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో రూ.5కోట్లతో కాపు భవనాలను నిర్మించి ఇందులో వసతి సౌకర్యం, ఉపాధి శిక్షణా తరగతుల నిర్వహణ జరుపుతామన్నారు. మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్ అనూరాధ మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా ప్రాంగణాలలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తమ టిడిపి ప్రభుత్వం మహిళా ప్రాంగణాల అభివృద్ధికి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందన్నారు. ఈ సభలో ఆర్థిక సంస్థ డైరెక్టర్ శైలజ, మహిళా ప్రాంగణం అధికారిణి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
15 నుండి అంతర్ కళాశాలల ఆర్చరీ ఛాంపియన్‌షిప్ పోటీలు
* ఆచార్య ఎస్ రామకృష్ణారావు
మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 13: కృష్ణా విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఆర్చరీ (విలు విద్య) ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు ఉప కులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు తెలిపారు. సోమవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందూ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించే అఖిల భారత అంతర్ విశ్వ విద్యాలయాల విలువిద్య ఛాంపియన్ షిప్ పోటీలలో 19 రాష్ట్రాలలోని 95 విశ్వ విద్యాలయాలకు చెందిన 600 మంది పురుషులు, 400 మంది మహిళలు పాల్గొంటారన్నారు. 180 స్వర్ణ, రజిత, కాంస్య పతకాలు విజేతలకు అందించనున్నట్లు తెలిపారు. పోటీ నిర్వహణకు 200 మంది టీమ్ అధికారులు, 35 మంది సాంకేతిక అధికారులు, వికాస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలకు చెందిన 75 మంది బిపిఇడి శిక్షణ పొందేవారిని నియమించినట్లు తెలిపారు. రైల్వేస్టేషన్, బస్టాండుల వద్ద సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోటీలలో పాల్గొనే వారికి హిందూ కళాశాల వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపారు. 15వ తేదీ ఉదయం 9గంటలకు హిందూ కళాశాలలో నిర్వహించే ప్రారంభ సభలో మార్చ్ఫాస్ట్ నిర్వహిస్తామన్నారు. ఈ సభలో రాష్ట్ర యువజన, క్రీడల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, డా. కామినేని శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 19వ తేదీ సాయంత్రం 4గంటలకు జరిగే బహుమతి ప్రదానోత్సవ సభ జరుగుతుందన్నారు. విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య సూర్యచంద్రరావు మాట్లాడుతూ గతంలో సౌత్‌జోన్ అంతర్ కళాశాలల స్థాయి టెన్నిస్ (పురుషులు), కబడీ (మహిళలు), వాలీబాల్ (పురుషులు, మహిళలు) పోటీలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్చరీ అసోసియేషన్ సెక్రటరీ చెరుకూరి సత్యనారాయణ, అసోసియేషన్ ప్రతినిధి ఆర్‌ఎన్ సింగ్ (వారణాసి), క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకె సుందరకృష్ణ, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డా. ఎన్ శ్రీనివాసరావు, డా. వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.