కృష్ణ

పరస్పర ఆరోపణలతో దద్దరిల్లిన బందరు కౌన్సిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 13: మచిలీపట్నం పురపాలక సంఘ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కౌన్సిల్ అత్యవసర సమావేశం రగడ రగడగా మారింది. చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో కౌన్సిల్ హాలు దద్దరిల్లింది. 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, మంచినీటి అవసరాల నిమిత్తం ట్యాంకర్లను అద్దెకు తీసుకునే అంశాలపై వాదోపవాదాలు జరిగాయి. వైసిపి సభ్యులు చైర్మన్ పోడియం ముందు బైఠాయించారు. తీవ్ర స్థాయిలో వాగ్వివాదాల అనంతరం రెండు అంశాలపై వైసిపి డిసెంట్ తెలిపింది. నెలాఖరులో ఏర్పాటు చేయాల్సిన సమావేశాన్ని నెల మధ్యలో నిర్వహించడం ఏమిటంటూ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చాబా నిలదీశారు. దీనిపై స్పందించిన చైర్మన్ బాబా ప్రసాద్ 14వ ఆర్థిక సంఘం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మార్చి 25వతేదీ నాటికి ఖర్చు చేయాల్సి ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన టెండర్లను ఆన్‌లైన్‌లో పిలిచినట్లు తెలిపారు. ఈ కారణంతోనే కౌన్సిల్‌ను అత్యవసరంగా సమావేశ పర్చడం జరిగిందని వివరించారు. వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు 10 ట్యాంకర్లను అద్దె ప్రాతిపదికన తీసుకునే అంశాన్ని అజెండాలో పొందుపర్చగా దీనిపై తీవ్ర స్థాయిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీనిపై అధికార పక్షానికి చెందిన వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం, ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, కౌన్సిలర్ నారగాని ఆంజనేయ ప్రసాద్ జోక్యం చేసుకుని ప్రతిపక్ష సభ్యులతో తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగారు. ఈ అంశంపై వైసిపి సభ్యులు చైర్మన్ పోడియం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. చైర్మన్ బాబా ప్రసాద్ నచ్చ చెప్పటంతో వైసిపి సభ్యులు డిసెంట్ తెలిపారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.10కోట్లకు సంబంధించి సప్లమెంటరీ అజెండాను కౌన్సిల్ ఆమోదించింది. 14వ ఆర్థిక సంఘ నిధులు, అద్దె ట్రాక్టర్ల అంశాలపై ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ బాబా ప్రసాద్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్యను కలిసి డిసెంట్‌ను అందజేశారు. ఈ సమావేశంలో కమిషనర్ జస్వంతరావు, ఎంఇ కామేశ్వరరావు, ఆర్‌ఓ వెంకటేష్, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.