కృష్ణ

పీతురు కాలువ నిర్మాణంలో పాలకవర్గ ద్వంద్వ వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 16: పీతురు కాలువ నిర్మాణం విషయంలో మైలవరం పంచాయితీ పాలకవర్గం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని సీపీఎం నేతలు ఆరోపించారు. గురువారం స్థానిక సీపీఎం కార్యాలయంలో మండల కార్యదర్శి ఎండి జానీ, సీఐటియు నాయకులు జాని, సాల్మన్‌రాజులు విలేఖర్లతో మాట్లాడుతూ గతంలో పీతురుకాలువ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని పక్కా ఇళ్ళ నిర్మాణం చేపట్టారని దీంతో ఎగువ నుండి వస్తున్న మురుగు, వరద దిగువనున్న నారాయణనగర్‌పై పడి నివాసాలకు ఆటంకం ఏర్పడుతోందన్నారు. ఆక్రమణదారులను తొలగించి కాలువ నిర్మాణాన్ని చేపట్టకుండా నారాయణనగర్ వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జినిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయితీ పాలకవర్గం ఉన్నతాధికారులకు తీర్మానం పంపటం ఎంతవరకు సమంజసమన్నారు. రెండు రోజుల క్రితం తాము ఆందోళన చేసినప్పుడు ఒక రకంగా సమాధానం చెప్పిన పాలకవర్గం ఉన్నతాధికారులకు అనుమతి కోసం పంపిన పత్రంలో మరో రకంగా ఉండటం శోచనీయమన్నారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వాస్తవానికి నారాయణనగర్ వైపు పీతురుకాలువ నిర్మాణానికి సంబంధించిన డిజైనింగ్ లేనప్పుడు తాజాగా అక్కడ బ్రిడ్జి కట్టి కాలువను తవ్వటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని వారు ప్రశ్నించారు. ఆక్రమణలను తొలగించి కాలువ నిర్మించకుంటే నారాయణనగర్ వాసులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.
శ్రీకొండలమ్మ హుండీ ఆదాయం రూ.12.18లక్షలు
గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 16: మండల పరిధిలోని వేమవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కొండలమ్మ వారి ఆలయ హుండీలను గురువారం దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు. మచిలీపట్నం దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వి సుధాకర్ పర్యవేక్షణలో లెక్కింపును నిర్వహించారు. 45 రోజులకు రూ.12లక్షల 18వేల 97లు వచ్చినట్లు ఆలయ అధికారి గోగిలేని లీలాకుమార్ తెలిపారు. ఈ లెక్కింపులో దేవాదాయ శాఖ అధికారులు, ఇండియన్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.