కృష్ణ

జిల్లాలో ముమ్మరంగా మినుము కోతలు, వరి మాసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 16: జిల్లాలో మినుము కోతలు, వరి మాసూళ్లు ఊపందుకోవటంతో కూలీలకు చేతినిండా పని దొరకటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న కూలీలు, ముఖ్యంగా మహిళా కూలీలు కాయతీత పనులకు ఉత్సాహంగా వెళ్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు ఇప్పటి వరకు చేసిన అప్పులను తీర్చుకునేందుకు, కుటుంబ పోషణకు తహతహలాడుతున్నారు. ఇదిలా ఉండగా మినుము కోతలు, వరి మాసూళ్లు ఒకే సారి రావటంతో కూలీల డిమాండ్ అమంతంగా పెరిగిపోవటంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. దీన్ని గమనించిన కూలీలు ధరలను రెట్టింపు చేశారు. మహిళా కూలీ రూ.250లు డిమాండ్ చేస్తుండగా మగవారు రూ.450లకు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూలీలకు చేతి నిండి పని దొరకటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారనడంలో సందేహం లేదు.

ఎన్టీఆర్ నిర్మాణాలకు శంకుస్థాపన
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 16: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశ పెట్టిన ఎన్టీఆర్ గృహ కల్ప పేదల పాలిట వరమని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అన్నారు. స్థానిక 10వ వార్డులో ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద పేదలకు నిర్మించే పక్కా గృహ నిర్మాణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. పసుపులేటి వెంకట సుబ్బమ్మ, యార్లగడ్డ శివలీల, యార్లగడ్డ రమ గృహాల నిర్మాణ పనులకు చైర్మన్ కొబ్బరికాయకొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డా. బిఆర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారికి నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఎన్టీఆర్ గృహకల్ప పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. గృహం లేని ప్రతి పేదవాడికి పక్కా గృహం నిర్మించటమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ అమీర్, బస్రీం బేగం, అజ్మతున్నీసా తదితరులు పాల్గొన్నారు.