కృష్ణ

వ్యాపారులను బెదిరిస్తే సహించేదిలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఫిబ్రవరి 17: గుడివాడ బంటుమిల్లి రోడ్డులో 214ఎ జాతీయ రహదారి పక్కనే వ్యాపారం చేస్తున్న నిర్వాసితులు, ప్రజలను బెదిరించి స్థలాలను బలవంతంగా లాక్కోవాలని చూస్తే సహించేది లేదని, వీరందరికీ అండగా నిలబడతానని ఎమ్మెల్యే కొడా లి నాని అన్నారు. శుక్రవారం స్థానిక బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు విస్తరణకు ఇచ్చే స్థలానికి ఎటువంటి పరిహారం ఇవ్వకపోవడం సరికాదన్నారు. వ్యాపారుల అంగీకా రం లేకుండా అంగుళం కూడా తీసుకోలేరన్నారు. బంటుమిల్లి రోడ్డు జాతీయ రహదారి అని, దీన్ని మున్సిపల్ అధికారులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. జాతీయ రహదారుల శాఖ విస్తరణకు తీసుకుంటే ఆయా స్థలాలకు ఖచ్చితంగా పరిహారం అందుతుందన్నారు. వ్యాపారులు, నిర్వాసితులు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. మున్సిపాలిటీకి సంబంధిత యజమానులు దఖలు రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప ఆ యా స్థలాలపై మున్సిపాలిటీకి ఎటువంటి హక్కు ఉండదన్నారు. కార్యక్రమంలో వైసీపి రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, జిల్లా స్టీరింగ్ కమిటీ స భ్యుడు మండలి హనుమంతరావు, కౌ న్సిలర్ గొర్ల శ్రీనివాసరావు, మాజీ కౌ న్సిలర్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

ఆటపాటలతో సందడి సందడి
మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 17: స్థానిక హిందూ కళాశాల క్రీడా మైదానంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఇంటర్ వర్సిటీ ఆర్చరి ఛాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం క్రీడాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు సాయం సంధ్యా సమయంలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. క్రీడాకారులు ప్రదర్శిస్తున్న కూచిపూడి నృత్యాంశాలతో పాటు జానపద నృత్యాలు ప్రేక్షకులను హుషారెక్కిస్తున్నాయి. ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుండి తరలి వచ్చిన క్రీడాకారులు తమ ఇంటిని మరిచి ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతున్నారు.