కృష్ణ

ఎక్కుపెట్టిన విల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 17: కృష్ణా విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం మచిలీపట్నం హిందూ కళాశాల క్రీడా మైదానం వేదికగా జరుగుతున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీల్లో విల్లంబులు దూస్తున్నాయి. రాష్ట్రేతర ప్రాంతాల నుండి తరలి వచ్చిన క్రీడాకారులు అతి ప్రాచీనమైన విలువిద్యలో తమ ప్రతిభా ప్రావీణ్యాలను చాటుతున్నారు. క్రీడా మైదానంలో సందడి వాతావరణం నెలకొన్నా కళ్ల ముందు కనిపిస్తున్న లక్ష్యాన్ని కనురెప్పపాటులో ఛేదిస్తున్నారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు విల్లంబును ఎక్కు పెడుతున్న సమయంలో ప్రాచీన కాలంలో విలువిద్యలో రాణించిన ధీరులను స్మరణ చేసుకుని బాణాలు సంధిస్తున్నారు. ఎవరికి వారు వారి వారి రాష్ట్ర భాషల్లో జయహో అంటూ నినాదాలు చేస్తూ బాణాలు సంధిస్తూ రాష్ట్భ్రామానంతో పాటు మాతృ భాష పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇండియన్, రికర్వ్, కాంపౌండ్ రౌండ్స్ గాను శుక్రవారం నాటికి ఇండియన్ రౌండ్ పోటీలు పూర్తయ్యాయి. పురుషుల, మహిళల విభాగంలో జరిగిన ఈ పోటీల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం, కేరళ రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలికట్‌కు పతకాల పంట పండింది. చౌదరి చరణ్‌సింగ్ విశ్వవిద్యాలయం క్రీడాకారులు ఐదు విభాగాల్లో నాలుగు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకాన్ని దక్కించుకున్నారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ క్రీడాకారులు మూడు విభాగాల్లో రెండు స్వర్ణ, ఒక కాంస్య పతకాన్ని దక్కించుకుని విజయబావుటా ఎగుర వేశాయి. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు, రిజిస్ట్రార్ ఆచార్య డి సూర్యచంద్రరావు, మరికొంత మంది ప్రముఖులు పతకాలు బహూకరించి అభినందించారు. ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ పోటీలను తిలకించేందుకు పట్టణానికి యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.