కృష్ణ

ఎకరా మినుము పంటకు రూ.20వేల పరిహారిన్ని చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 20: తెగుళ్లతో మినుము పంటను నష్టపోయిన కౌలు రైతులను ఆదుకునేందుకు తక్షణం చర్యలు చేపట్టి ఎకరాకు రూ.20వేల పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండల కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యుడు చేబ్రోలు భాస్కరరావు, మండల కౌలురైతు సంఘం అధ్యక్షుడు వీరంకి శోభనాద్రి, కార్యదర్శి అద్దేపల్లి శ్రీమన్నారాయణ, మండల సిపిఎం కార్యదర్శి సిహెచ్ సుబ్బారావు, సిఐటియు కార్యదర్శి వి స్వరూపరాణి, జె ఏసోబు తదితరుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. హరిబాబు మాట్లాడుతూ మినుము పంటను నష్టపోయిన రైతుల్లో ఎక్కువగా కౌలురైతులు ఉన్నారని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాధిత రైతుల వివరాలను ఇంత వరకు నమోదు చేయకపోవటం శోచనీయమన్నారు. అనేకమంది రైతులు తెగుళ్లు సోకిన తోటలను తొలగించారని, కొందరు పశువులకు మేపారని, ఇలాంటి రైతులను రేపు ఎలా గుర్తిసారని ప్రశ్నించారు. రైతులు మినుము పంటను కాపాడుకునేందుకు వేల రూపాయల మందులను వాడి పంటచేతికి రాక అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. రైతు మళ్ళీ ఇంకొకపంట వేయాలంటే ఎకరాకు రూ.20వేలు పరిహారం అందించాలని హరిబాబు పేర్కొన్నారు. ధర్నా అనంతరం తహశీల్దార్ జి భద్రుకి వినతిపత్రం అందజేశారు.

భగవంతుని వైభవాన్ని చాటిచెప్పేదే భాగవతం
మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 20: భగవంతుని వైభవాన్ని చాటి చెప్పేది భాగవతమని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి కల్యాణ వ్యాఖ్యాత, ప్రవచన కర్త సముద్రాల రంగనాధన్ అన్నారు. స్థానిక రాబర్టుసన్‌పేట శ్రీ రంగనాయక స్వామి దేవస్థానంలో సోమవారం శ్రీ లక్ష్మీ నారాయణ యాగ సహిత సహస్ర కలశాభిషేకం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రంగనాథన్ మాట్లాడుతూ అందరి సుఖ సంతోషాలను కోరే వారు భాగవతులని, ప్రహ్లాద, నారద, పరాశర, వ్యాస, అంబరేష మొదలగు వారి గురించి పోతన భాగవతంలో చెప్పారన్నారు. అనంతరం ప్రత్యేక పూజలను టిటిడి వేద ఆగమ పండితులు, వేంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రొ. అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు బ్రహ్మత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంగాల ప్రశాంత్, ఎం శేషుకుమార్, జంగాల హరనాధ బాబు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ కార్య నిర్వహణాధికారి అడబాల శ్రీనివాస్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.