కృష్ణ

ఎన్‌ఆర్‌జిఎస్ ద్వారా రోజుకు 2 లక్షల పనిదినాలు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 20: ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రోజూ రెండు లక్షల పనిదినాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం, వ్యక్తిగత మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలు, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలపై కలెక్టర్ బాబు.ఎ సమీక్షించారు. ఉపాధి హామీ పథకం కింద పనులను పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో 65వేల మందికి పైగా కూలీలు పనిచ్తేన్నారన్నారు. రానున్న నాలుగు నెలలు కీలకమన్నారు. గ్రామ గ్రామాన ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున పనులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ దిశగా మండల ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఆరు లక్షలకు పైగా జాబ్ కార్డులు ఉన్నాయని, 12లక్షల 70 వేల మంది కూలీలు నమోదు అయినట్లు తెలిపారు. పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యుయస్, గృహ నిర్మాణాలకు సంబంధించిన పనులు జరుగుతున్నందున ఆయా శాఖల సమన్వయంతో పనులను కూలీలకు కల్పించాలని సూచించారు. మెట్ట ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున చేపట్టే అవకాశం ఉన్నందున ఆ దిశగా అధికారులు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. నీరు-చెట్టు పథకం ద్వారా ఎంపిడివోలు, తహశీల్దార్ల సహకారంతో ఉపాధి హామీ పనులు చేపట్టాలన్నారు. అటవీ శాఖాధికారులు కూలీలకు పనులు కల్పించడంలో ఆశించిన స్థాయిలో ప్రతిభకనబర్చడం లేదని మండిపడ్డారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో భాగంగా లక్ష్యాలను పూర్తి చేసి బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఫేస్-1లో భాగంగా కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలను గుర్తించినట్లు తెలిపారు. రానున్న మే నాటికి నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తికావాలన్నారు. వేసవి కాలం వస్తున్న నేపథ్యంలో మంచినీటి సమస్యలపై ఎటువంటి ఫిర్యాదులు రావడానికి వీల్లేదన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మంచినీటి చెరువులను నీటితో నింపడం జరిగిందన్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖాధికారులు క్షేత్ర స్థాయిలో వారి పరిధిలోని చెరువులను పరిశీలించి తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదు వచ్చినా సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో చేపట్టిన 120 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను మార్చి 31వతేదీ లోపు పూర్తిచేయాలన్నారు. ఇప్పటికే 9వేల 700 గృహాల నిర్మాణం పూర్తిచేశామని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని ప్రాజెక్ట్ డైరెక్టర్ శరత్‌బాబు కలెక్టర్‌కు వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, మడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, డిఆర్‌ఓ చెరుకూరి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

‘మడ’ కార్యాలయానికి స్థల సేకరణకు
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
* జేసీ గంధం చంద్రుడు

మచిలీపట్నం, ఫిబ్రవరి 20: మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి శాశ్వత కార్యాలయ నిర్మాణానికై అవసరమైన స్థలం కోసం ప్రతిపాదనలు తయారు చేసినట్లు జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఖాళీగా ఉన్న 90 సెంట్ల స్థలాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ప్రస్తుతం కలెక్టరేట్ ఆవరణలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మడకు నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా స్థల పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు జాయింట్ కలెక్టర్ చంద్రుడు తెలిపారు. ఈ పరిశీలనలో మడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, ఆర్డీవో సాయిబాబు, తహశీల్దార్ బి నారదముని తదితరులు ఉన్నారు.