కృష్ణ

వైభవంగా ప్రారంభమైన శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, ఫిబ్రవరి 21: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన మండల పరిధిలోని పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ దుర్గా స్వామివారిని పెండ్లి కుమారుడుగా అలంకరించి బద్దు కుమారస్వామి అర్చకత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఏసి యం శారదా కుమారి దేవాదాయ శాఖ తరపున స్వామివారికి, అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకునివచ్చి ఆలయ ప్రధాన అర్చకుడు కుమారస్వామికి అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంటు టి చెన్నకేశవ, ఆలయ అర్చకుడు బద్దు వరప్రసాద్ శర్మ, శంకరమంచి భాస్కరశర్మ, విజయ్‌కుమార్ శర్మ, భక్తులు పాల్గొన్నారు.
నేటి నుండి పాతాళ భోగేశ్వరుని కల్యాణోత్సవాలు
కలిదిండి, ఫిబ్రవరి 21: కలిదిండిలో కొలువై ఉండి దక్షిణ కాశీగా పేరుప్రఖ్యాతులు సంతరించుకున్న శ్రీ పార్వతీ సమేత శ్రీ పాతళ భోగేశ్వర స్వామి మహాశివరాత్రి కల్యాణ మహోత్సవాలు ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ మేనేజర్ శింగనపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కల్యాణ మహోత్సవాలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, విద్యాశాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాసరావు, ఏలూరు పార్లమెంటు సభ్యుడు మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) స్వామివారికి పుట్టుపీతాంబరాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. 22న స్వామివారిని, అమ్మవారిని పెండ్లి కుమారుడు, కుమార్తెగా అలంకరిస్తారు. రాత్రి కె జ్యోతి బృందంచే కూచిపూడి భరతనాట్య ప్రదర్శన, 23 రాత్రి 1.20ని.లకు అడివి వెంకట గంగాధరశర్మ, అలివేలు దంపతులచే కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. 24న మహాశివరాత్రి తీర్ధం, తెప్పోత్సవం, నృత్య ప్రదర్శనలు. బాలనాగమ్మ ఘంటసాల పాటల కార్యక్రమం, 25న వసంతోత్సవం, రాత్రి ఏకపాత్రిభినయం, భక్తచింతామణి, 26న స్వామివారికి, అమ్మవారికి పవళింపుసేవ, రాత్రి మిమిక్రీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కలిదిండి వాసి గండికోట వెంకటేశ్వరరావు రూ.లక్షా 40వేల విలువుగల రెండు స్టీలు హుండీలను స్వామివారికి బహూకరించారు.
మహాశివరాత్రికి భారీ ఏర్పాట్లు
కృత్తివెన్ను, ఫిబ్రవరి 21: మండల కేంద్రం కృత్తివెన్నులో వేంచేసియున్న శ్రీ దుర్గా, పార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 24 నుండి ప్రారంభం కానున్న మహాశివరాత్రి ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, ఆలయాన్ని రంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 216ఎ జాతీయ రహదారి నుండి శివాలయం వరకు రోడ్డుకు ఇరువైపులా భారీగా విద్యుత్ దీపాలంకరణలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ మేనేజర్ శింగనపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ 24 స్వామివారి కల్యాణం, 25 తెప్పోత్సవం, 26 రథోత్సవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. శివరాత్రి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు గుడివాడ, బందరు డిపోల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మంచినీరు, దుస్తులు మార్చుటకు గదులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బోర్డు చైర్మన్ కానుమల్లి నాగశ్రీనివాస్ కూడా ఆలయాన్ని పర్యవేక్షించారు.

ఐలూరులో శివరాత్రికి ముమ్మర ఏర్పాట్లు
తోట్లవల్లూరు, ఫిబ్రవరి 21: ఈ నెల 24వతేదిన జరగనున్న శివరాత్రి మహోత్సవానికి దక్షిణకాశిగా పేరుగాంచిన ఐలూరులో స్నానమాచరించటానికి లక్షలాదిగా భక్తులు రానున్న సందర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలోని ఐలూరు కృష్ణానది వద్ద ఏర్పాటు చేస్తున్న జల్లుస్నానాల బోర్లు నిర్మాణ పనులు మంగళవారం చేపట్టారు. శివరాత్రికి వచ్చే భక్తుల సౌకర్యార్థం జల్లుస్నానాలకు బోర్లు, మంచినీటి సౌకర్యం కోసం చేతిపంపులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. శివరాత్రి మహోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్గకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.