కృష్ణ

నాగులేరు వద్ద మహాశివరాత్రికి విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 23: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా స్థానిక నాగులేరు వద్ద పురపాలక సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా కాలువలో నీటి మట్టాన్ని పెంచారు. అలాగే జల్లు స్నానాలను కూడా ఏర్పాటు చేశారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. ఒడ్డున ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, శ్రీ సిద్ధ రసలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ నాగ సాయిబాబా ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పనులు
మార్చిలోపు పూర్తి చేయాల్సిందే
* ఎమ్మెల్యే కాగిత
పెడన, ఫిబ్రవరి 23: మార్చి నెలాఖరు నాటికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన పనులు పూర్తి చేయాల్సిందేనని పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ అధికారులు, ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. సబ్‌ప్లాన్ కింద ఎస్సీ, ఎస్టీ వార్డులకు రూ.2.71 కోట్లతో చేపట్టనున్న పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. 6, 7, 9, 10, 18 వార్డులలో శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి విడతగా మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మరో విడత కూడా నిధులను మంజూరు చేయించానన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు పట్ల చూపిస్తున్న ప్రేమకు ఈ నిధుల మంజూరే తార్కాణమన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బండారు ఆనందప్రసాద్, మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, వైస్ చైర్మన్ హన్ను, పట్టణ టిడిపి అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, కౌన్సిలర్లు బూసం ఆనందరావు, కటకం ప్రసాద్, గరికముక్కు చంద్రబాబు, శానాపతి భిక్షం, మెట్ల గోపిప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలో 17 ప్రాంతాలలో రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. మొగ్గయ్యకాలనీ, 6వ వార్డు, 22వ వార్డులలో లాంఛనంగా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ కోతలను అరికట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు కోరారు.