కృష్ణ

నాగులేరులో భక్తజనప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 24: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు స్వామివార్ల దర్శనార్థం గంటల తరబడి క్యూ లైన్‌లలో పడిగాపులు పడ్డారు. నమక చమక పారాయణలతో ఆలయాలు మార్మోగాయి. స్వామివార్లకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు రాత్రి వరకు ఉపవాసం ఉండి శివ దర్శనం చేసుకుని దీక్ష విరమించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన గాలి గోపురాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు. పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. పెద ఉల్లింగిపాలెం శ్రీ అన్నపూర్ణా సమేత విశే్వశ్వర స్వామి ఆలయంలో సుమారు వంద మంది బ్రాహ్మణులు అభిషేకాలు నిర్వహించారు. ఖొజ్జిల్లిపేట నాగేశ్వర స్వామి ఆలయం, సర్కిల్‌పేట, గొడుగుపేట, బచ్చుపేటలలోని శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయాలు, చింతగుంటపాలెం నాగేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగులేరు మంచినీటి కాలువ జన సంద్రంగా మారింది. పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు నాగులేరు ఒడ్డున తమ పితృ దేవతలకు పిండ ప్రదానాలు గావించారు. అనంతరం నాగులేరులో స్నానమాచరించారు. సమీపంలోని రసలింగేశ్వర స్వామిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించుకున్నారు. పురపాలక సంఘం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేసింది. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పలు స్వచ్ఛంద, ధార్మిక సంస్థలు భక్తులకు ప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేశారు.

రేపు ఐఎంఎ రాష్ట్ర సదస్సు

* గుడివాడలో తొలిసారి
గుడివాడ, ఫిబ్రవరి 24: తొలిసారిగా గుడివాడ పట్టణంలో ఐఎంఏ రాష్ట్ర సదస్సు జరుగుతోంది. ఈ నెల 26వ తేదీన జరిగే సదస్సు ఈ ప్రాంతంలో జరగడం ఇదే తొలిసారి అని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పొట్లూరి గంగాధరరావు చెప్పారు. శుక్రవారం స్థానిక సత్యనారాయణపురంలోని ఐఎంఎ హాల్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు జరిగే ఈ సదస్సుకు వివిధ జిల్లాల నుండి అసోసియేషన్ వర్కింగ్ కమిటీ సభ్యులు విచ్చేస్తున్నారన్నారు. వైద్యులకు సంబంధించిన అనేక విషయాలపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సోమూరి వెంకట్రావు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ డిఆర్‌బి ప్రసాద్, గుడివాడశాఖ అధ్యక్షుడు డాక్టర్ రాజా తదితరులు పాల్గొన్నారు.

వైకాపా జిల్లా కార్యదర్శిగా అప్పిరెడ్డి
జగ్గయ్యపేట రూరల్, ఫిబ్రవరి 24: వైకాపా జిల్లా కార్యదర్శిగా మండలంలోని గౌరవరం గ్రామానికి చెందిన బూతుకూరి అప్పిరెడ్డిని నియమించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను, జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి కలిసి నియామక పత్రాన్ని అప్పిరెడ్డికి అందజేసారు. జిల్లాలో, నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, తనకు పదవిని ఇచ్చిన నేతలకు అప్పిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

భక్తులతో పోటెత్తిన ఆలయాలు
అవనిగడ్డ, ఫిబ్రవరి 24: మహా శివరాత్రిని పురస్కరించుకుని దివిసీమలోని పలు ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. పాత ఎడ్లలంకలోని శ్రీ బాల కోటేశ్వర స్వామి దేవస్థానం, వేకనూరులోని శ్రీ ఉభయ ముక్తేశ్వర స్వామి ఆలయం, అవనిగడ్డలోని శ్రీ రాజశేఖర స్వామి వారి ఆలయాల్లో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసుకున్న భక్తులు పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, విద్యానికేతన్ అధినేత లంకమ్మ ప్రసాద్‌లు శ్రీ రాజ శేఖర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల శిలాఫలకాన్ని బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలి మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో శివుడు విగ్రహం నెలకొల్పేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ఇఓ కెవి గోపాలరావు, టిడిపి నాయకులు మత్తి శ్రీనివాసరావు, బండే రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఎడ్లలంకలో న్యాయవాది రాయపూడి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.