కృష్ణ

శంకరా.. అభయంకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 24: మహాశివ రాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. భక్తుల శివ నామస్మరణలతో ప్రతిధ్వనించాయి. కృష్ణానదీ పరివాహక ప్రాంతాలు కిటకిటలాడాయి. కృష్ణానదిలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు శైవ క్షేత్రాలను దర్శించి పరమేశ్వరునికి విశేష అభిషేకాలు నిర్వహించుకున్నారు. వేకువ జాము నుండి శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి మొదలైంది. రాత్రి వరకు భక్తుల రద్దీ కనిపించింది. లక్షలాది మంది భక్తులు ప్రసిద్ధ శైవక్షేత్రాలలో భోళా శంకరుడిని దర్శించుకుని పునీతులయ్యారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకళ్ళేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయం, ఉభయ రామేశ్వర క్షేత్రాలైన ఐలూరు, ముక్త్యాల, జగ్గయ్యపేటలోని కోటి లింగాల క్షేత్రం, కంచికచర్ల శివసాయి క్షేత్రం, నందిగామ మండలం కూడలి సంగమేశ్వర స్వామి ఆలయం, మచిలీపట్నం నాగులేరు, పెదపట్నం, కృత్తివెన్ను గుడిదిబ్బ శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఆలయం తదితర ఆలయాలు స్వామివార్లకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అమ్మవార్లకు కుంకుమార్చనలు నిర్వహించి తమ భక్తిప్రపత్తులు చాటుకున్నారు. వేకువ జామునే నదీ స్నానాలకు వెళ్ళిన భక్తులు ఒకింత అసంతృప్తికి గురయ్యారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం లేక పోవటంతో అధికారులు, ఆలయ పాలకవర్గాలు జల్లు స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమ పితృదేవతలకు పిండప్రదానాలు సమర్పించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ అధికారులు ఐలూరు, కళ్ళేపల్లి తదితర ప్రసిద్ధ శైవక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులను నడిపింది. రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు కాగిత వెంకట్రావ్‌లు బందరు మండలం పెదపట్నంలోని శివాలయాన్ని దర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించుకున్నారు.

వరకట్న జ్వాలలో మరో సమిధ
* అత్తింటి ఆరళ్లకు వివాహిత ఆత్మహత్య
గుడివాడ, ఫిబ్రవరి 24: భర్త, అత్తింటి ఆరళ్ళకు ఓ వివాహిత బలయింది. తన భార్య ఉరేసుకుని చనిపోయిందని కట్టుకున్నవాడే అత్తమామలకు సమాచారం అందించిన ఈ సంఘటన స్థానికులను సైతం కలిచివేసింది. వరకట్నం కోసం తమ కుమార్తెను వేధించి కడతేర్చారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడివాడ తాలూకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ మాచవరానికి చెందిన కొత్తపల్లి ఆనంద్‌కుమార్, జ్యోతి దంపతుల కుమార్తె వేళంగిణి(21) అలియాస్ అమ్ములును గుడివాడ రూరల్ మండలం తట్టివర్రు గ్రామానికి చెందిన పెయ్యల కన్షిక వర్ధన్‌కు ఇచ్చి ఏడాదిన్నర కిందట వివాహం చేశారు. లక్ష రూపాయలు కట్నంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా పెళ్ళిలో రూ.50వేలు, రెండేళ్ళ తర్వాత మిగతా రూ.50వేలు ఇచ్చేలా ఇరువైపులా పెద్దలు ఒప్పం దం చేశారు. పెళైన తర్వాత కన్షిక వర్ధన్, వేళంగిణిలు తట్టివర్రులో కాపురం చేస్తున్నారు. ఇటీవల కన్షిక వర్ధన్ భార్య వేళంగిణిని మిగిలిన కట్నం రూ.50వేలు తీసుకురావాలని వత్తిడి తెచ్చాడు. అప్పటి నుండి ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతోంది. కన్షిక వర్ధన్‌తో పాటు అతని పినతల్లి, పినతల్లి కోడళ్ళు కూడా వేధిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. వేళంగిణి మృతివార్తను తెలుసుకున్న తల్లిదండ్రులు ఆనంద్‌కుమార్, జ్యోతిలు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ఒక బ్యాంక్‌లో కన్షిక వర్ధన్‌కు అటెండర్‌గా ఉద్యోగం వచ్చిందని, అప్పటి నుండి కట్నం తీసుకురావాలని వేధిస్తున్నాడన్నారు. గురువారం ఉదయం 9గంటలకు వేళంగిణి తమకు ఫోన్ చేసి కట్నం తీసుకురావాలని కోరిందన్నారు. అంతలోనే 11 గంటల సమయంలో వేళంగిణికి ఆరోగ్యం బాగోలేదని, వెంటనే రావాలని స్థానికులు ఫోన్ ద్వారా తెలియజేశారన్నారు. విజయవాడ నుండి తట్టివర్రు వచ్చేటప్పటికీ వేళంగిణి ఉరివేసుకుని మృతి చెందిందని, ఆమె మృతదేహాన్ని పేటికలో పెట్టినట్టు అల్లుడు చెప్పాడన్నారు. తమ కుమార్తెకు ఆత్మహత్య చేసుకునేంత పరికితనం లేదన్నారు. కుమార్తె ఒంటిపై, తలపై గాయాలున్నాయని, ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారన్నారు. న్యాయం చేయాలంటూ డిఎస్పీ అంకినీడుప్రసాద్ కాళ్ళపై పడి వేడుకున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని శుక్రవారం స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డిఎస్పీ అంకినీడుప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసును వేర్వేరు కోణాల్లో దర్యాప్తు జరిపి న్యాయం చేస్తామని డిఎస్పీ తెలిపారు.