కృష్ణ

భూములిచ్చిన రైతులకు త్వరలో పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 24: బందరు ఓడరేవు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు త్వరలో లీజు చెల్లించనున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు తెలిపారు. పోర్టు భూముల సమీకరణ విషయంలో రైతుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసి స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు భూములు ఇచ్చిన రైతులకు లీజు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందుకు అవసరమైన నిధులు కూడా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో భూ సమీకరణకు ఏర్పాటు చేసిన కమిటీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్ట, మాగాణి, ఆయకట్టు భూముల నిర్ధారణ కోసం గ్రామాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు రెవెన్యూ రికార్డుల్లో సవరణలు చేయనున్నట్లు చెప్పారు. ముందస్తుగా ఓడరేవు నిర్మాణ ప్రాంతంలో భూసమీకరణపై దృష్టి సారించి రైతుల సమస్యలను పరిష్కరించాలని కమిటీ ప్రతినిధులకు సూచించారు. గ్రామాల వారీగా రైతులతో సమీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. గ్రామాల వారీ సమీక్షల ద్వారా రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్యఙ, టిడిపి సీనియర్ నాయకుడు బూరగడ్డ రమేష్ నాయుడు, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, కౌన్సిలర్లు నారగాని ఆంజనేయ ప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, కొట్టె వెంకట్రావ్, తహశీల్దార్ బి నారదముని తదితరులు పాల్గొన్నారు.