కృష్ణ

వీరపనేనిగూడెం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జికి కృషి: ఎమ్మెల్యే వంశీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, ఫిబ్రవరి 27: చెన్నై - కలకత్తా ప్రధాన రైలుమార్గంలో పెద్దఅవుటపల్లి, వీరపనేనిగూడెం రహదారిపై ఫ్లైఓవర్ రైలు వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ పేర్కొన్నారు. సోమవారం వీరపనేనిగూడెంలో ఏపిఐఐసి ఆధ్వర్యంలో స్థాపించే ఇండస్ట్రీయల్ పార్కులో పారిశ్రామిక వేత్తల సమావేశం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగింది. డాక్టర్ వంశీ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ పెద్దఅవుటపల్లి లెవెల్ క్రాసింగ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జీ నిర్మించేందుకు సిఎం చంద్రబాబుతో నేరుగా సమీక్షిస్తానన్నారు. రహదారి అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటానని, పారిశ్రామిక వేత్తలు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి పరిశ్రమలు స్థాపించడం హర్షణీయమన్నారు. తమ అండా ఎప్పడూ ఉంటుందన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. వీరపనేనిగూడెం ఇండస్ట్రీయల్ పార్కును మోడల్ ఎస్టేట్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సంఘాధ్యక్షులు వేమూరి రవికుమార్ మాట్లాడుతూ ఈ పార్కులో ప్రత్యక్షంగా 2600 మందికి, పరోక్షంగా మరో 7800 మంది ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అమరావతి ఇండస్ట్రీయల్ అసోసియేషన్ అధ్యక్షులు ఏవి రావు మాట్లాడుతూ ఈ ప్రాంత యువతకు హైదరాబాద్‌లోని తమ పరిశ్రమల్లో శిక్షణనిచ్చి, వీరపనేనిగూడెంలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు ముందుగానే శిక్షణ అవసరం అన్నారు. 2017 చివరి నాటికి పరిశ్రమలు స్థాపించే లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. మోడల్ ఇండస్ట్రీస్‌ని స్థాపిస్తామన్నారు. రహదార్లు, డ్రైనేజీలు, విద్యుత్, నీటి సరఫరా వంటి వౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఏపిఐఐసి సీఈ వరప్రసాద్ తెలిపారు. రోడ్ల నిర్మాణపు పనులు పూర్తి చేశామని, ప్లాట్లు అభివృద్ధి చేసుకుంటే సౌకర్యాల ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాకు ఆ శాఖకు నగదు చెల్లించినట్లు ఆయన తెలిపారు. 10 వేల కిలో వాట్స్ విద్యుత్ స్టేషన్ నిర్మించాల్సి ఉందన్నారు. వౌలిక సదుపాయాలు వెంటనే పూర్తి చేస్తే పరిశ్రమల స్థాపన మరింత త్వరగా ఏర్పాటవుతుందన్నారు. 81 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్లాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మనే్న సుందరరావు, శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

నేడు జిల్లాలో
జస్టిస్ మంజునాథ కమిషన్ క్షేత్ర పర్యటన

మచిలీపట్నం, ఫిబ్రవరి 27: కాపులను బిసిల్లో చేర్చే విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ కెఎల్ మంజునాథ కమిషన్ మంగళవారం జిల్లాలో క్షేత్ర పర్యటన చేయనుంది. సోమవారం విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాలలో ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథతో కూడిన బృందం మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి కాపుల స్థితిగతులపై అధ్యయనం చేయనున్నారు. ఉదయం 9గంటలకు విజయవాడ నుండి బయలుదేరి ముదినేపల్లి మండలం బొమ్మినంపాడు గ్రామానికి వెళతారు. అక్కడి నుండి పెడన మండలం నందమూరు, బందరు మండలం తపసిపూడి గ్రామంతో పాటు పురపాలక సంఘంలోని ఏదైనా ఒక మురికి వాడను ఈ కమిటీ సందర్శించి బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు జిల్లా బిసి సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్ యుగంధర్ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు.