కృష్ణ

ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్యమకారులపై లాఠీచార్జ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఫిబ్రవరి 27: గుడివాడ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు వచ్చిన ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సందర్భంగా 100మందిని అరెస్ట్ చేసి వన్‌టౌన్, పెదపారుపూడి, పామర్రు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. నందివాడ మండలం ఇలపర్రు గ్రామంలో భూస్వాముల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని దళితులకు కేటాయించాలంటూ వామపక్షాలు, ప్రజాసంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 10గంటలకు స్థానిక నెహ్రూచౌక్ సెంటర్ నుండి ఉద్యమకారులు ర్యాలీగా స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. గుడివాడ డిఎస్పీ వై అంకినీడుప్రసాద్ ఆధ్వర్యంలో 100మందికి పైగా పోలీసులు ఆర్డీవో కార్యాలయం ఎదుట మోహరించారు. బారిగేట్లను ఏర్పాటు చేసి ఆర్డీవో కార్యాలయంలోకి ఉద్యమకారులు వెళ్ళకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు, సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజలతో పాటు ఉద్యమకారులు రోడ్డుపై బైఠాయించారు. నిరసన తెలియజేస్తున్న ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఆందోళన చేస్తున్న వారందరినీ పోలీసు వాహనాల్లో ఎక్కించి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా రఘు, వనజలు విలేఖర్లతో మాట్లాడుతూ దళితులకు కేటాయించిన భూములు దళితులకే చెందుతాయని, ప్రభుత్వం మాత్రం భూస్వాములకు కొమ్ము కాస్తోందన్నారు. దళితులను అణచివేసేందుకు పోలీసులతో ప్రభుత్వం లాఠీచార్జ్ చేయించిందన్నారు. అధికార పార్టీకి చెందిన మహిళా ఎంపికి 27ఎకరాల భూమి ఉందని, ఇదంతా దళితులకు చెందినదేనన్నారు. నందివాడ మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు 5వేల ఎకరాల దళితుల భూమి భూస్వాముల చేతుల్లో ఉందని, దీనిపై కూడా పోరాడతామన్నారు. దళితులకు భూములు వచ్చేలా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. అరెస్ట్ అయిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండా వీరాస్వామి, సిపిఐ గుడివాడ, పామర్రు నియోజకవర్గాల కార్యదర్శులు గూడపాటి ప్రకాష్‌బాబు, దగాని సంగీతరావు, సిపిఎం డివిజన్ కార్యదర్శి ఆర్‌సిపి రెడ్డి, నాయకులు మురాల రాజేష్, ఆర్‌కె తదితరులు ఉన్నారు.

పోర్టుకు భూములిచ్చిన
రైతుల త్యాగాన్ని మరువం
* ఎంపి కొనకళ్ల నారాయణరావు

మచిలీపట్నం, ఫిబ్రవరి 27: బందరు ఓడరేవు నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం అభినందనీయమని పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. మండల పరిధిలోని బుద్ధాలపాలెం, కరగ్రహారం గ్రామాలకు చెందిన 20 మంది రైతులు 56 ఎకరాల భూమిని పోర్టు, కారిడార్ ఏర్పాటుకు భూసమీకరణలో ఇచ్చేందుకు ముందుకు వచ్చి అంగీకార పత్రాలను ఎంపి కొనకళ్ల నారాయణరావు ద్వారా మడ డెప్యూటీ కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపి నారాయణరావు అంగీకార పత్రాలు ఇచ్చిన రైతులను అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన రైతులు కూడా భూములు ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోర్టు కోసం భూములను త్యాగం చేసిన రైతులను ప్రభుత్వం అద్భుతమైన ప్యాకేజీ ఇస్తుందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపి కొనకళ్ల నారాయణరావు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.