కృష్ణ

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పేరు మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 28: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పేరును ఎస్సీ, ఎస్టీ సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి నిధి (ఎస్సీ, ఎస్టీ సస్టైనబుల్ అండ్ ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్ ఫండ్)గా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 25 శాతం సబ్ ప్లాన్ నిధులను ఆదాయం సముపార్జించే పథకాలకే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికి సంబంధించి 4వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని సిఎం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల్లో సంతృప్తి స్థాయి పెరగాలన్నారు.వచ్చే ఏడాది అంబేద్కర్ జయంతి నాటికి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మించనున్నట్లు వెల్లడించారు. సాంఘిక సంక్షేమ శాఖలో 512 కమ్యూనిటీ హాల్స్, 168.9 కోట్ల రూపాయలతో 8 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. టోఫెల్, జీమ్యాట్ శిక్షణకు వార్షికాదాయ పరిమితిని 6 లక్షల రూపాయలకు, భీమిలి మండలం కాపులుప్పాడలో ట్రైబల్ మ్యూజియం, గిరిజన ప్రాంతాల్లో మరో 74 అంబులెన్సుల ఏర్పాటు, మెరుగైన రవాణాకు 5 జిల్లాల్లో 12 బస్సులు, రంపచోడవరంలో గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, అరకులో ట్రైబల్ స్పోర్టు స్కూల్ , లంబసింగిలో 5.73 కోట్లతో కాటేజీల ఏర్పాటుకు నిర్ణయించామని తెలిపారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్ బాబు, పాల్గొన్నారు.