కృష్ణ

ప్రమాదాలకు కారణాలపై అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో రహదారులపై జరుగుతున్న ప్రమాదాలపై అధ్యయనం చేయాలని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో రహదారుల భద్రత, ప్రమాదాలపై మంగళవారం రాత్రి సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రమాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను రూపుదిద్దేలా తక్షణమే చర్యలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు. ప్రతినెల చివరి మంగళవారం రహదారి భద్రతపై సమీక్ష నిర్వహిస్తున్నానన్నారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి నెలరోజుల్లోగా నివేదిక అందచేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిఘా ఉంచి భారీ జరిమానాలు విధించాలన్నారు. రహదారుల భద్రత, ప్రమాదాల నివారణకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. అతివేగంగా నడిపే వాహనాలపై నిఘా ఉంచాలని, ఇందుకు సెల్ టవర్లు, జిపిఎస్ వంటి సమాచార వ్యవస్థను ఉపయోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, డిజిపి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
బస్సు ప్రమాదంపై సిఎం, మంత్రుల దిగ్భ్రాంతి

విజయవాడ, ఫిబ్రవరి 28: కృష్ణాజిల్లా ముండ్లపాడు వద్ద జరిగిన బస్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం తరువాత ఆయన పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందచేయాలని అధికారులను ఆదేశించారు. చికిత్స, సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ సిఎం (రెవెన్యూ) కెఇ కృష్ణమూర్తి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.