కృష్ణ

జాతీయ రహదారులపై ప్రైవేట్ బస్సుల స్వైర విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 28: జాతీయ రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇష్టారాజ్యంగా స్వైర విహారం చేస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి లాభార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు వ్యవహరించడం వల్ల ఘోరాతి ఘోర ప్రమాదాలు సంభవించి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అసలు కాంట్రాక్ట్ క్యారియర్‌గా నడవాల్సిన బస్సులు నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ బస్సులకు పోటీగా స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రవాణా, పోలీస్‌శాఖ అధికారులు ట్రావెల్స్ యాజమాన్యాలతో లాలూచీపడి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనేందుకు తాజాగా దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సంఘటన ప్రబల నిదర్శనంగా నిలుస్తోంది. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ క్యారియర్‌గా అనుమతి పొందిన బస్సులో ఒకే ప్రదేశంలోనే ప్రయాణికులను ఎక్కించుకుని గమ్యస్థానంలోనే వారిని దింపాల్సి ఉంది. ఆ ప్రయాణికులు కూడా ఒకే బృందానికి చెందినవారై ఉండాలి. వారి వివరాలన్నింటినీ బస్సు బయలుదేరే ముందు సమీప పోలీస్‌స్టేషన్‌లో అందించాలి. అలాగే దాని నకలు బస్సు డ్రైవర్ వద్ద ఉండాలి. మార్గమధ్యంలో ఏ ఒక్కరినీ ఎక్కించుకునే వీలులేదు. ఇక ప్రమాదానికి గురైన బస్సు భువనేశ్వర్‌లో బయలుదేరే ముందు కేవలం 14 మంది మాత్రమే ఎక్కారు. ఆ తర్వాత మార్గమధ్యంలో శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు 15 మంది, విశాఖపట్టణంలో హైదరాబాద్‌కు 14 మంది, విజయవాడకు ఒకరు, టెక్కలి నుంచి హైదరాబాద్‌కు ముగ్గురు, విజయవాడకు ఒకరు, బెర్హంపూర్ నుంచి హైదరాబాద్‌కు ఇద్దరు టిక్కెట్లు తీసుకున్నారు. ఇలా మొత్తం 50 సీట్లు నిండిపోయాయి. ఒక్కోసారి రెండో డ్రైవర్ అంటూ ఉంటే ఆ డ్రైవర్‌కు కూడా సీటు ఉండదు. ఇక క్లీనర్‌కు ఎప్పుడూ సీటు ఉండడు. ఇదే బస్సు గతంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణంకు వెళ్లేటప్పుడు కూడా అతి వేగంగా ప్రమాదకరంగా వెళ్లినట్లు చెబుతున్నారు. గత జనవరి 12 తేదీ ఇదే ఎపి02టిసి714 నెంబర్ బస్సు తూ.గో జిల్లా కత్తిపూడి చెక్‌పోస్టు వద్ద అధికారులు నిలిపివేసారు. అప్పుడు డ్రైవర్ అత్యంత ప్రమాదకరంగా నడుపుతున్నట్లు గుర్తించి అతనికి రెండువేల రూపాయల జరిమానా విధించారని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించరాదు. అయినప్పటికీ కొన్ని ట్రావెల్స్ ఊరూవాడా బుకింగ్ కేంద్రాలు తెరచి టిక్కెట్లు విక్రయిస్తుంటే ఇప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారు. పైగా ఆర్‌టిసి బస్‌స్టేషన్ల పరిసరాల్లోనే ఈ బుకింగ్ కేంద్రాలుండటమే గాక బస్సులు కూడా నిలుస్తున్నాయి. బస్సు అడుగు భాగాన, పైన భారీఎత్తున సరుకు లగేజీ తీసుకెళుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ప్రైవేట్ బస్సుల వల్ల భారీ నష్టం వస్తున్నందున అక్రమ రవాణా అడ్డుకోవాలంటూ కార్మిక సంఘాలు ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నాయ.