కృష్ణ

అప్పుడు, ఇప్పుడు ఆయన నుంచే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 28: తన సర్వీస్‌లో తొలి, చివరి పోస్టింగ్‌లను ఎస్‌పి టక్కర్ ద్వారానే అందుకున్నానని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం తెలిపారు. సిఎస్‌గా కల్లం బాధ్యతలు స్వీకరించాక, పదవీ విరమణ చేయనున్న సిఎస్ టక్కర్‌కు వీడ్కోలు కార్యక్రమాన్ని వెలగపూడి సచివాలయంలో మంగళవారం నిర్వహించారు. సచివాలయ జిఎడి ఉద్యోగులు, ఎన్‌ఐసి, సిఎంఒ, ఎపి సచివాలయ సంఘం ప్రతినిధులు టక్కర్‌కు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో సిఎస్ కల్లం మాట్లాడుతూ తన తొలి పోస్టింగ్ భువనగిరి సబ్ కలెక్టర్ అని, అప్పుడు ఆ పదవీ బాధ్యతలను టక్కర్ నుంచి అందుకున్నానని గుర్తు చేసుకున్నారు. తన సర్వీస్‌లో చివరి పోస్టింగ్ కూడా ఆయన నుంచే అందుకోవడం యాదృచ్ఛికమన్నారు. ఆయన జూనియర్‌లను ప్రోత్సహించే వారని, స్ఫూర్తిని ఇచ్చేవారన్నారు. తనను ఆయన సోదరునిగా చూసేవారని గుర్తు చేసుకున్నారు. గత రెండు, మూడు సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలను టక్కర్ రూపొందించారన్నారు. వారి ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. పదవీ విరమణ చేయనున్న సిఎస్ టక్కర్ మాట్లాడుతూ భువనగిరి అసిస్టెంట్ కలెక్టర్‌గా 36 సంవత్సరాల క్రితం తన సర్వీస్ ప్రారంభమైందన్నారు. పాకిస్థాన్ నుంచి తన తల్లితండ్రులు దేశానికి వచ్చేశారని తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించారని, త్వరలోనే అది సాకారం కానుందన్నారు. ఎపి సచివాలయ సంఘం నేత మురళీ కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన మనసు మార్చుకుని సిఎస్‌గా కల్లం పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు ఎల్.పాణిగ్రాహి, కిషోర్, ఉద్యోగుల ప్రతినిధి సులోచన తదితరులు పాల్గొన్నారు.