కృష్ణ

జగన్ క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 2: పోలీసుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్షనేత, వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. అంతకుముందు ఎమ్మెల్యే రోజా, ఇప్పుడు జగన్, గతంలో ఎమ్మెల్యే పాలెం శ్రీకాంత్‌రెడ్డి పోలీసుల పట్ల నోరు పారేసుకున్నారని, ఇలాంటి పునరావృతమైతే సహించేది లేదని సంఘం ప్రతినిధులు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కూడా పోలీసులు పని చేశారని, ఆయన ఏరోజు కూడా పోలీసులనుగాని, ప్రభుత్వ ఉద్యోగులనుగాని ఈ విధమైన దుర్మార్గ, పరుష వ్యాఖ్యలు చేసిన సందర్భాలు లేవన్నారు. అలాంటి నాయకుడి వారసుడిగా ఉన్న జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినందున ఆయన ఆత్మకూడా క్షోభిస్తుందని హితవు చెప్పారు. కృష్ణాజిల్లా ముళ్ళపాడు గ్రామం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనను పురస్కరించుకుని ‘పోలీసుల నుంచి కలెక్టర్ వరకు అందరూ అవినీతిపరులే’ అని జగన్ వ్యాఖ్యానించడం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతకు తగదని ఖండించారు. తాము అధికార, ప్రతిపక్ష పార్టీల తరుఫున పని చేయటం లేదన్నారు. ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నామని, అదేవిధంగా రాజకీయ నాయుకులైన మీకు రక్షణ కల్పించే మాపై ఈ విధంగా దూషణకు పాల్పడటం వల్ల పోలీసుల మనోధైర్యం దెబ్బతినడం వల్ల దుష్ప్రరిణామాలు ఎదురవుతాయని సూచించారు. విలేఖరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు ఎం గంగాధర్, కోశాధికారి టి గోపాల్, విజయవాడ అధ్యక్షుడు ఎం సోమయ్య, రాష్ట్ర కో ఆప్షన్ మెంబర్ వి గోపి తదితరులు పాల్గొన్నారు.