కృష్ణ

దోమ గెలిచింది .. రాజధాని ఓడింది ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 3: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ముఖద్వార నగరంగా అభివృద్ధి చేస్తున్నామన్న విజయవాడ నగరంలో దోమల బెడద నగర ప్రజలకు నరకం చూపిస్తోంది. నానాటికీ అధిగమవుతున్న దోమల సమస్య పరిష్కారం కోసం విఎంసి ఖర్చు చేస్తున్న వ్యయం కంటే నగరవాసులు తమ గృహాల్లో వినియోగించే దోమల నివారణ ఉపకరణాల వ్యయం ఎక్కువగా కనిపిస్తోందనడంలో అతిశయోక్తిలేదు. కోట్లు కుమ్మరించి చేపడుతున్న అభివృద్ధికి దోమల వృద్ధి ఒక సవాల్‌గా మారింది. ప్రపంచ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పర్చాలన్న నగర పాలకుల లక్ష్యానికి దోమకాటు ఒక అవరోధంగానే మారింది. దోమల నివారణకు అధికారికంగా చేపట్టే చర్యలకు తోడుగా ప్రజలు తమ పరిసరాలు, గృహ ఆవరణలలో కూడా ఆయా నియమ నిబంధనలను పాటిస్తేనే ఆశించిన ఫలితాలను చవిచూస్తామంటున్న అధికారుల వాదనకు కొంత నిజం ఉన్నా వారి లెక్కల ప్రకారం చేస్తున్న ఖర్చుకు, చర్యలకు దోమనేది కంటికి కనిపించకూడదు. దోమ కాటుతో వ్యాప్తి చెందే మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ వంటి ప్రాణాంతక జ్వరాలు విజయవాడ నగరానికి శాశ్వత అతిథి రోగాలు. ప్రతి నెలా వైరల్ జ్వరాలు నమోదవుతూనే ఉన్నాయి. గత ఏడాది మొత్తం మీద 550 కేసులు నమోదైనట్టు అధికారిక లెక్కలే చెబుతుండగా నమోదు కాని జ్వర పీడుతుల సంఖ్య కూడా అంతే స్థాయిలో ఉంది. ఈనెల, ఆనెల అనేది లేకుండా జనవరి నుంచి డిసెంబర్ వరకూ దోమ సంచారం లేని రోజు ఉండదు, అలాగే దోమ కాటుకు గురై ప్రజలు అనారోగ్యానికి గురికాని నెల లేదనే చెప్పాలి. ప్రస్తుతం జనవరి, ఫిబ్రవరి నెలలోనే సుమారు 50 కేసుల వరకూ వైరల్ జ్వరాలు నమోదైనట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. కేవలం రాత్రి సమయాల్లోనే కాకుండా పగటి వేళల్లో కూడా దోమకాటు నగరానికి ప్రత్యేకమనే చెప్పాలి. నగర పరిధి ప్రాంతాల్లో క్రమం తప్పకుండా దోమల నివారణ చర్యలు చేపడుతున్నామని చెబుతున్న అధికారుల లెక్కలు ఇలావున్నాయి. దోమల నివారణకు విఎంసి చేస్తున్న వార్షిక వ్యయాన్ని పరిశీలిస్తే ఎబేట్, ఎంఎల్ ఆయిల్ ఖర్చు 46లక్షల 60వేలు, ఎంఎల్‌టి, పైరత్నం ఖర్చు 40లక్షల 40 వేల రూపాయలు సుమారుగా ఉంది. ఒకపక్క నివారణా చర్యలు, మరోపక్క దోమల వృద్ధి రెండూ సమాంతరంగా ఉన్నాయంటే నివారణా చర్యల్లో నెలకొన్న లోపాలను అంచనావేయవచ్చు.
ఇదిలావుండగా దోమలపై యుద్ధం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పట్టణ, నగరాల్లోనే కాక గ్రామాల్లో కూడా ఆశించిన ఫలితాలు సాధించలేదు. పాలకులు దోమలపై యుద్ధం ప్రకటించినా చివరికి ఆ యుద్ధంలో దోమలే గెలిచాయన్నది కాదనలేని వాస్తవం. యుద్ధం సమయంలో చేపట్టిన కార్యక్రమాల జాడ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో మలేరియా విభాగానికి దోమల నివారణే ప్రధాన కర్తవ్యం. ఈ విభాగంలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. పది డివిజన్లు కలిపి ఒక జోన్‌గాను, నగరం మొత్తాన్ని 6 జోన్లుగా విభజించారు. మొత్తం జోన్లలో సుమారు 500 మందైనా సిబ్బంది లేకపోగా ఉన్న వారిలో కొంత మంది శాశ్వత సెలవులు, మరికొందరు డెప్యూటేషన్‌పై ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారు. ఈ డెప్యూటేషన్లలో కూడా కొంత మంది కేటాయింపులు అనధికారికమే. అయ్యవార్ల ఇంటి పనుల నిమిత్తం మలేరియా సిబ్బందిని నియమించినట్టు అధికారిక సమాచారం. అవుట్‌ఫాల్ డ్రెయిన్లు, అంతర్గత సైడ్ కాల్వల పొడవు, వాటిలో పనిచేసే సిబ్బంది సంఖ్యను పరిశీలిస్తే ఒకొక్క ఏరియాలో పది రోజుల కొకసారైనా సంపూర్ణంగా పనిచేసేందుకు సిబ్బంది లేకపోవడంతో ఉన్నావారితోనే తూతూ మంత్రంగా ఆయా చర్యలు చేపడుతున్నారు.
దోమను గుడ్డు, లార్వా దశలోనే అంతమొందించేందుకు ఎంఎల్ ఆయిల్ ఎబేట్ మందులను స్ప్రే చేస్తుండగా ఎగిరే దోమల నివారణకు ఫాగింగ్ చర్యలను చేపడుతారు. దోమను లార్వా దశలోనే అంతం చేస్తున్నామని చెబుతున్న అధికారుల మాటలకు ఏరోజు కారోజు కొత్తగా పుట్టుకొచ్చి ఎగిరెగిరి కాటేస్తున్న దోమ సంగతేమిటన్న ప్రశ్నకు సమాధానం కనిపించదు. నగరంలో ప్రవహించే ప్రవహించే ఏలూరు, బందర్, రైవస్ కాల్వలు కూడా దోమల వృద్ధికి నిలయాలుగా మారడం నగరానికి శాపమనే చెప్పాలి. కాలుష్య కారకాలుగా ఉండే నదీ కాల్వల్లో నీటి సరఫరా బంద్ చేసే ప్రస్తుత వేసవి రోజుల్లో నదీ కాల్వల్లో వృద్ధి చెందే దోమలు మరీ ప్రాణాతకం. నదీ కాల్వల్లో చేపట్టే నివారణా చర్యల వలన కలిగే ప్రయోజనాలు కూడా అంతంత మాత్రమే. వాస్తవానికి వేసవిలో ఎండ వేడిమికి మనిషి ప్రాణాలే పోతుండగా దోమ మాత్రం నిక్షేపంగా జీవించి ఉంటుందంటే విజయవాడ నగర దోమ బలం ఏమిటో ఇక చెప్పాల్సిన అవసరమే లేదు.