కృష్ణ

నిరంతరం ఇ-పాస్ బుక్‌ల జారీ పర్యవేక్షణ: కెఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 7: ఇ-పాస్ పుస్తకాల జారీ అంశాన్ని సిసిఎల్‌ఎ, తాను ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నానని ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. రైతులకు పాస్ పుస్తకాలపై ఎమ్మెల్సీ ఆర్ రెడ్డప్పరెడ్డి మండలిలో మంగళవారం అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ కోర్టు కేసులు, సరైన వివరాలు లేకపోవడం, అధికారులకు పనుల ఒత్తిడి వంటి కారణాలతో పాస్ పుస్తకాల జారీలో జాప్యం జరుగుతోందని తెలిపారు. రెడ్డప్పరెడ్డి మాట్లాడుతూ ఇ-పాస్ పుస్తకాల జారీలో అవినీతి ఎక్కువగా ఉందని, క్షేత్ర స్థాయిలో జాప్యం జరుగుతోందని, నిర్ధిష్ట కాలపరిమితి జారీకి విధించగలరా? అని ప్రశ్నించారు. మరో ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు కూడా క్షేత్ర స్థాయిలో పాస్ పుస్తకాల జారీలో ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. తూర్పు గోదావరి జిల్లాల్లో చౌకధరల దుకాణాల గురించి ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అడిగిన ప్రశ్నకు మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ఆ జిల్లాలో 297 దుకాణాలు ఖాళీగా ఉన్నాయని, 285 షాపులకు సంబంధించి కోర్టులో కేసులు ఉన్నాయన్నారు.
దర్గా నిధులను రాబడతాం: పల్లె
విశాఖలోని హజరత్ ఇషాక్ మదాని అలియా దర్గాకు సంబంధించిన నిధులను ఎట్టిపరిస్థితుల్లోనూ రాబడుతామని మంత్రి పల్లె రఘనాథరెడ్డి స్పష్టం చేశారు. ఆ దర్గాకు చెందిన స్థిర, చరాస్తుల గురించి ఎమ్మెల్సీ మహమ్మద్ జానీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం దేవాడ గ్రామంలో దర్గాకు 5307 ఎకరాల భూమి ఉందన్నారు. ఇందులో 1122 ఎకరాలను హెచ్‌పిసిఎల్‌కు, 523 ఎకరాలను సింహాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు కేటాయించినట్లు తెలిపారు. భూముల ద్వారా 51.2 కోట్ల రూపాయల మేర ఆదాయం లభించిందని, మరో 20.2 కోట్ల రూపాయలను తెలంగాణలో ఖర్చు చేశామని తెలిపారు. వీటిలో 35 కోట్ల రూపాయల మేరకు డిపాజిట్లు ఉన్నాయన్నారు. ఈ మొత్తం విభజన చట్టం 10వ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రానికి తెలంగాణ నుంచి రావాల్సి ఉందన్నారు.
ఇన్‌పుట్ సబ్సిడీ త్వరగా చెల్లించండి
నష్టపోయిన వేరుశనగ రైతులకు ఇన్‌పుట్ సబ్బిడీ త్వరగా చెల్లించేలా ఏర్పాటు చేయాలని పలువులు ఎమ్మెల్సీలు కోరారు. వేరుశనగ పంటకు జరిగిన నష్టంపై జి తిప్పేస్వామి అడిగిన ప్రశ్నకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానం ఇచ్చారు. వేరుశనగ పంటను కాపాడేందుకు రైన్‌గన్‌ల వినియోగంలో నెల రోజుల జాప్యం వైకాపా నేతలు కోర్టుకు వెళ్లడం వల్ల జరిగిందన్నారు. త్వరలో ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లిస్తామన్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేశామని, 939 కోట్ల రూపాయల మేర ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాల్సి ఉందని, వీలైనంత త్వరగా చెల్లించేలా చూడాలని కోరారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్ మాట్లాడుతూ వైరస్ కారణంగా రైతులు మినుము పంట కూడా నష్టపోయారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కూడా త్వరగా మినుము రైతులకు త్వరగ నష్టపరిహారం చెల్లించాలన్నారు.
పొంతన లేని రైతు ఆత్మహత్యల సంఖ్య
రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వం అందించిన వివరాలకు, నేషనల్ క్రైం బ్యూరో నివేదికకు పొంతన లేదని వైకాపాకు చెందిన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలపై ఆయన అడిగిన ప్రశ్నకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానం ఇస్తూ, 2014లో 48మంది, 2015లో 136, 2016లో 34 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. దీనిపై ఉమ్మారెడ్డి స్పందిస్తూ నేషనల్ క్రైం రికార్డుల ప్రకారం 516 మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఇందులో 19.6 శాతం మంది సాగుకు సంబంధించి, 38 శాతం మంది రుణాల సమస్యలతో మృతి చెందారని తెలిపారు. త్రిసభ్య కమిటీ, బ్యూరో వివరాలకు పొంతన లేదన్నారు. స్వామినాథన్ కమిటీ నివేదిక అమలు చేస్తామని హామీ ఇచ్చి నేటి వరకూ అమలు చేయకపోవడాన్ని ప్రశ్నించారు. మంత్రి పుల్లారావు బదులిస్తూ, కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉందని, అప్పుడే స్వామి నాథన్ నివేదిక అమలు చేసే వీలు కలుగుతుందన్నారు.