కృష్ణ

ఎస్సీ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, మార్చి 9: ఎస్సీల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని వెంకటాపురం, బోడుగుంట గ్రామాలకు చెందిన 48 మంది ఎస్సీ మత్స్యకారులకు 90 శాతం సబ్సిడీపై వలలు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. శ్రీరామా ఫిషర్‌మెన్ కో-ఆపరేటీవ్ సొసైటీకి చెందిన 22 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10వేలు విలువ చేసే వలలను 90శాతం సబ్సిడీపై పంపిణీ చేశారు. బోడగుంట గ్రామానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు వలలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయిబాబు, ఫిషరీస్ ఎడి రాఘవరెడ్డి, ఫిషరీస్ ఇన్‌స్పెక్టర్ పోతురాజు, జిల్లా మత్స్యకారుల సహకార సంఘం డైరెక్టర్ లకనం నాగాంజనేయులు, ఎంపిడివో లక్ష్మీ కుమారి, ఎంపిపి జయలక్ష్మి, తహశీల్దార్ విమల కుమారి, అవనిగడ్డ, కొడాలి మార్కెట్ యార్డుల డైరెక్టర్ రావి నాగేశ్వరరావు, సీతారామాంజనేయులు, ఎంపిటిసి మేరుగ సురేష్, కొమ్ము విల్సన్, కోన రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతమ్మ ఆలయానికి రూ.44లక్షల ఆదాయం

పెనుగంచిప్రోలు, మార్చి 9: స్థానిక శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.46లక్షల 551ల ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణ అధికారి ఎం రఘునాధ్, పాలకమండలి చైర్మన్ కర్ల వెంకట నారాయణ తెలిపారు. ఆలయంలోని మొత్తం 11 హుండీలను గురువారం లెక్కింపు నిర్వహించగా హుండీల ద్వారా రూ.44,14,216లు, అలాగే అన్నదాన కార్యక్రమానికి 1,86,335లు ఆదాయం సమకూరగా బంగారం 80గ్రాములు, వెండి 600 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. మరియు ఆలయం వద్ద వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు నిర్వహించిన వేలం పాట ద్వారా మరో 2లక్షల 60వేల ఆదాయం సమకూరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇఇ రమేష్, డిఇ రమ, పాలకమండలి సభ్యుడు కొడె వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, ముండ్లపాటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రిజర్వాయర్ నిర్మాణ పనులు పరిశీలన
మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 9: స్థానిక భాస్కరపురంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను గురువారం మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఏ మాత్రం తగ్గకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట 8వ వార్డు టిడిపి ఇన్‌ఛార్జ్ బొమ్మిడి శ్రీరాములు తదితరులు ఉన్నారు.

అనాసాగరంలో గ్రామ దేవత ప్రతిష్ఠ

నందిగామ, మార్చి 9: నందిగామ శివారు అనాసాగరంలో శ్రీమహలక్ష్మమ్మ, శ్రీమద్దిరావమ్మ, శ్రీఅంకమ్మ, శ్రీగంటలమ్మ దేవతా ప్రతిష్ఠా మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమైయ్యాయి. గురువారం విఘ్నేశ్వర పూజ, గోపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాసన, రక్షాబంధన, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం, వాస్తుహోమం, అగ్నిప్రతిష్ఠ తదితర పూజా క్రతువులను వేదపండితులు నిర్వహించారు. ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా గ్రామంలో విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల కటౌట్‌లు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ప్రతిష్ఠా మహోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.