కృష్ణ

20 శాతం హెచ్‌ఆర్‌ఎకు కృషిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 9: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం హెచ్‌ఆర్‌ఎ వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని శాసనమండలికి ఎన్నికైన బచ్చుల అర్జునుడు ఎన్‌జిఓ సంఘ నాయకులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా గురువారం తూర్పు కృష్ణా ఎన్‌జిఓ సంఘ నాయకులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా 20 శాతం హెచ్‌ఆర్‌ఎ ఇప్పించాలని ఎన్‌జిఓ సంఘ నాయకులు కోరగా ఈ విషయమై ఆర్థికశాఖ మంత్రితో మాట్లాడి తన వంతు కృషి చేస్తానన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఏ సమస్య వచ్చినా నేరుగా తన వద్దకు వస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కృష్ణా ఎన్‌జిఓ సంఘ అధ్యక్షుడు వుల్లి కృష్ణ, ప్రధాన కార్యదర్శి దారపు శ్రీనివాస్, సభ్యులు సూర్యకుమార్, సాయికుమార్, సీతారామయ్య, సుబ్బారావు, పాషా, రాజేంద్ర ప్రసాద్, జగధీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

లాభాల బాటలో కెడిసిసి
* ఉపసభాపతి బుద్ధప్రసాద్
చల్లపల్లి, మార్చి 9: సహకార ఉద్యమానికి ఊపిరి పోసిన కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రాష్ట్రంలోనే లాభాల బాటలో నడుస్తోందని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం చల్లపల్లి కెడిసిసి బ్యాంక్ ఆవరణలో స్వయం సహాయక సంఘాల రుణమేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బుద్ధప్రసాద్ 30 స్వయం సహాయక సంఘాలకు రూ.1.42కోట్ల రుణాలను అప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలు దశ, దిశ నిర్దేశించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనన్నారు. డ్వాక్రా సంఘాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకు వచ్చారన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు సహకార సంఘాలు న్యాయం చేస్తున్నాయన్నారు. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. అప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 425 సంఘాల్లో మైక్రో ఎటియంలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరంగా కెడిసిసి ముందుకు సాగుతుందన్నారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి రైతులకు రెండు శాతం రాయితీని ఒక్క కృష్ణాజిల్లాలోనే ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కెడిసిసి బ్యాంక్ సిఇఓ సుబ్రహ్మణ్యం, డైరెక్టర్ చంద్రరావు, ఎంపిపి యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్, డిజియం రంగబాబు, ఎఎంసి చైర్మన్ తుమ్మల చౌదరి బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆధునిక పరిజ్ఞానంతో అభివృద్ధి
* వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని
మండవల్లి, మార్చి 9: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యంత ఆధునిక పరిజ్ఞానం వినియోగించి వైద్యరంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని ఉనికిలి, పుట్లచెరువు, అయ్యవారి రుద్రవరం గ్రామాల్లో గురువారం సాయం త్రం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో 1,400 ఆసుపత్రుల్లో 30 వేల మం ది సిబ్బంది పని చేస్తున్నారన్నారు. పే ద, బలహీనవర్గాలకు ఆధునిక వైద్యం అందించేందుకు ప్రణాళికాబద్ధంగా వైద్యం అందిస్తామన్నారు. గత 40 ఏళ్లుగా సాధించలేని అభివృద్ధి కేవలం ఏడాదిన్నర కాలంలోనే సాధించామని తెలిపారు. కైకలూరు ప్రజలకు తాను అందుబాటులో లేనందుకు విచారం వ్యక్తం చేశారు. ఎక్కడ ఉన్నా కైకలూరు ప్రజల గౌరవం, ప్రతిష్ఠలను కాపాడతానని తెలిపారు. కైకలూరు నియోజకవర్గ ప్రజల తలసరి ఆదా యం రాష్త్రంలోనే ప్రథమస్థానంలో ఉందన్నారు. ఈ నియోజకవర్గంలో నెలకొన్న రహదార్లు, మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ నెల 10వ తేదీన తాగునీరు విడుదలయ్యేలా చర్యలు తీసుకుని తాగునీటి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. దీనిపై నీటిపారుదలశాఖ ఎస్‌ఇకి ఫోన్ చేసి 10న నియోజకవర్గానికి తాగునీరు విడుదల అయ్యేలా చూడాలని ఆదేశించారు. అయ్యవారి రుద్రవరం నుంచి చిగురుకోట రహదారిని ఆర్‌అండ్‌బీ రహదారికి మార్చి, దాని అభివృద్ధికి రూ. 3 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, మాజీ జడ్పీటీసీ సభ్యులు చింతపల్లి అంకినీడు, ముదునూరి సీతారామరాజు, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, ఆర్డీవో చక్రపాణి, మాజీ ఎఎంసీ చైర్మన్ సామర్ల శివకృష్ణ, నీటిసంఘం, డిసి, వైఎస్ చైర్మన్లు శేషగిరిరావు, సురేష్‌బాబు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.