కృష్ణ

పట్టణంలో పార్కులను సుందరీకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), మార్చి 12: పట్టణంలోని మున్సిపల్ పార్కులను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం స్థానిక 9వ వార్డు ఆశీర్వాదపురంలో రూ.40లక్షలతో చేపట్టనున్న పార్కు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో నూరు శాతం సిసి రోడ్లు నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రూ.19.50 కోట్ల సబ్ ప్లాన్ నిధులతో దళితవాడల్లో రోడ్లు, పార్కులు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టిడిపి సీనియర్ నాయకుడు కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), కౌన్సిలర్లు కొట్టె వెంకట్రావ్, నారగాని ఆంజనేయ ప్రసాద్, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఇలియాస్ పాషా, వంపుగడల చౌదరి తదితరులు పాల్గొన్నారు.

కలచివేసిన నాగిరెడ్డి మరణం: మాజీ డెప్యూటీ స్పీకర్ వేదవ్యాస్

మచిలీపట్నం, మార్చి 12: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, నంద్యాల నియోజకవర్గ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆకాల మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. ఆదివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడుతూ నాగిరెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయన్నారు. చిరకాల మిత్రుడైన నాగిరెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. నాగిరెడ్డితో తనకు రాజకీయంగానే కాకుండా సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీతో పాటూ ప్రజారాజ్యం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషించిన నాగిరెడ్డి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చిందన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించిన నాగిరెడ్డి మృతితో కర్నూలు జిల్లా ప్రజలు గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోయారన్నారు. ఆయన మృతికి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వేదవ్యాస్ తెలిపారు.