కృష్ణ

భక్తులతో పోటెత్తిన విశ్వనాథపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, మార్చి 12: అత్యంత మహిమాన్వితురాలైన శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లిని దర్శించేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి జాతర జాతర సందర్భంగా కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామం భక్తజన సందోహంగా మారింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి భారీ క్యూలైన్లలో భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. సుమారు 70వేల మంది పైబడి భక్తులు అమ్మవారిని దర్శించినట్లు అధికార వర్గాల సమాచారం. అర్ధరాత్రి నుండే ఆలయానికి భక్తుల తాకిడి తగిలింది. ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బందరు డియల్‌పిఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. తహశీల్దార్ ఎవి నారాయణ రెడ్డి, ఎంపిడివో వెంకటేశ్వరరెడ్డి, ఆలయ పాలకవర్గ చైర్మన్ తోట సూర్యం, కార్య నిర్వాహక కార్యదర్శి తుర్లపాటి రామచంద్ర కార్యక్రమాలను పర్యవేక్షించారు. అవనిగడ్డ డియస్‌పి ఖాదర్ బాషా పర్యవేక్షణలో అవనిగడ్డ, చల్లపల్లి సర్కిల్‌కు చెందిన పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా గ్రామంలో వన్‌వే ట్రాఫిక్ ఏర్పాటు చేశారు. వేసవి తాపం నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లతో పాటు పులిహోర పొట్లాలను పంపిణీ చేశారు.

అలరించిన అందెల రవళులు
కూచిపూడి, మార్చి 12: నాట్యక్షేత్రం కూచిపూడిలో నిర్వహిస్తున్న సిద్ధేంద్ర నాట్య మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన ఆదివారం శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళా వేదికపై మంగళపల్లి బాల మురళీకృష్ణ విరచిత ఘనపటి కౌత్వం నారాయణ తీర్థుల తరంగంగా దుర్గా తరంగం రంగదాసు కీర్తనగా దశవతారాలను గంగాధర్ కూచిపూడి నృత్యంగా ప్రదర్శించారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర భావన వైష్ణవిలు జయదేవుని అష్టపది ప్రజాసేవ బ్రహ్మేంద్రస్వామి కీర్తనగా నారాయణీయంలను ప్రదర్శించి కరతాళ ధ్వనులు అందుకున్నారు. చివరగా కోల్‌కత్తాకు చెందిన దేవయాని బసు భరతనాట్యం మురళీధర కౌత్వం నటనం ఆడనే కీర్తన ఆనంద తాండవ గణపతి పదం లిం గాష్టకం, థిల్లానా, మీరాభజన ప్రదర్శించి ప్రసంసలందుకున్నారు.