కృష్ణ

బీచ్ అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 12: మంగినపూడి బీచ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పాలని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. మంగినపూడి బీచ్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఇప్పటికే మంగినపూడి బీచ్ ముందు ప్రాంతాన్ని మెరక చేసి బీచ్ ఫ్రంట్ వాల్‌ను నిర్మించినట్లు తెలిపారు. ఈ వాల్ వెంబడి రహదారి నిర్మాణంతో పాటు ఫుట్‌పాత్ కూడా నిర్మిస్తున్నామన్నారు. ఈ పరిశీలనలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కౌన్సిలర్ నారగాని ఆంజనేయ ప్రసాద్, వైస్ ఎంపిపి ఊసా వెంకట సుబ్బారావు, ఎంపిటిసి నాగమల్లేశ్వరరావు, పార్టీ నాయకులు ఇలియాస్ పాషా, వంపుగడల చౌదరి, కుర్రా నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

పేటలో ఘనంగా
వైకాపా ఆవిర్భావ దినోత్సవం
జగ్గయ్యపేట, మార్చి 12: వైకాపా 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కోదాడ రోడ్డులోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద నేతలు పార్టీ జండాను ఆవిష్కరించి స్వీట్‌లను పంపిణీ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జగన్మోహనరెడ్డి సారధ్యంలో నిరంతరం పోరాటం చేస్తామని, కార్యకర్తలకు, బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటామని నేతలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి చిన్నా, నేతలు తుమ్మల ప్రభాకర్, ఎంవి చలం, పఠాన్ ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.