కృష్ణ

మంచినీటి ఎద్దడి రానివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 12: మచిలీపట్నం, పెడన పురపాలక సంఘాలతో పాటు పరిసర గ్రామాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పూర్తి స్థాయిలో నింపేందుకు అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. గత యేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కాలువల ద్వారా వచ్చే నీటిని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో పంపింగ్ చేసేందుకు అత్యధిక సామర్ధ్యం కలిగిన మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను ఆదివారం రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ల నారాయణరావులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేసవిలో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. గత యేడాది తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను నింపేందుకు అధిక సామర్ధ్యం కలిగిన మోటార్లను వినియోగించి రాత్రి పగలు పంపింగ్ చేశామన్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. 1650 హెచ్‌పి సామర్ధ్యం కలిగిన 15 మోటార్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఐదు రోజుల్లో చెరువును పూర్తి స్థాయిలో నింపనున్నట్లు తెలిపారు. 5.50 మీటర్ల సామర్ధ్యం గల చెరువులో ప్రస్తుతం 2.50మీటర్ల మేర నీటి మట్టం ఉందన్నారు. మరో మూడు మీటర్ల వరకు నింపాల్సి ఉందన్నారు. ఈ నీటితో జూన్ మాసం వరకు సరఫరా చేయవచ్చన్నారు. పట్టణ ప్రజల దాహార్తి తీర్చడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పని చేయాలని సూచించారు. నాగార్జున సాగర్ నుండి ప్రకాశం బ్యారేజ్‌కు నీటి విడుదల జరిగిందన్నారు. సోమవారం ఉదయానికి బందరు కాలువ ద్వారా నీరు తరకటూరు వచ్చే అవకాశం ఉందన్నారు. నీటిని లిఫ్ట్ చేసే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా 1100 కెవిఎ సామర్ధ్యం కలిగిన ఐదు ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ తరకటూరు సమ్మర్ స్టోరేజ్‌ను యుద్ధప్రాతిపదికన నింపేందుకు చర్యలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఏడాది ఇదే విధమైన సమస్య ఏర్పడుతున్నందున శాశ్వత ప్రాతిపదికన నీటిని లిఫ్ట్ చేసే చర్యలను సైతం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కౌన్సిలర్లు నారగాని ఆంజనేయ ప్రసాద్, కమిషనర్ జస్వంతరావు, ఇంజనీర్ కామేశ్వరరావు, పార్టీ నాయకులు ఇలియాస్ పాషా, వంపుగడల చౌదరి, కుర్రా నరేంద్ర, రామదేవి వేణుబాబు తదితరులు పాల్గొన్నారు.