కృష్ణ

ప్యాకేజీకి చట్టబద్ధత మరో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం 5కోట్ల రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయడమేనని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. విభజన సమయంలో నాటి యుపిఎ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రద్దు చేసారా.. లేక అది అమలులో ఉండగానే ప్రస్తుత క్యాబినెట్ ఈ నిర్ణయం ఎలా తీసుకుం దో స్పష్టం చేయాలని గురువారం ఒక ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. ఎపికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనపై రాష్ట్ర సిఎం చంద్రబాబు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మరో కొత్త రాజకీయ కుట్ర, మోసానికి తెరలేపారన్నారు. ఎపి పునర్వవస్థీకరణ చట్టాన్ని అమలుచేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందోనన్న భయంతోనే ఆ చట్టాన్ని మరుగున పెడుతున్నారని విమర్శించారు. ఎపి పునర్వవస్థీకరణ చట్టంలో ఉన్న అంశాలు ప్రస్తత సాయం ప్యాకేజీలో లేకపోవడం గమనార్హమన్నారు. పోలవరం కాంట్రాక్టు పనులు ఇవ్వాలని కోరడం చంద్రబాబు అవినీతి చర్యలకు నిదర్శమని, పోలవరాన్ని జాతీయ హోదా ప్రాజెక్టుగా ప్రకటించడమే కాకుండా కేంద్రమే దానిని నిర్మిస్తుందని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు.