కృష్ణ

హ్యాపీ..హ్యాపీగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 16: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం అయ్యేలా నగరాల్లో ప్రస్తుతం ఉన్న ఉద్యాన వనాలను హ్యాపీనెస్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పట్టణాలు, నగరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో అవుట్‌డోర్, ఇండోర్ ఫిట్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రీనరీని ఒక ఉపాధి మార్గంగా ఎంటర్‌ప్రెన్యూర్లను తయారు చేయాలని, ఈ రంగంలో వీలైనన్ని స్టార్టరప్స్‌కు ప్రోత్సాహం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ‘ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్’ చేపట్టిన పనుల ప్రగతిపై గురువారం రాత్రి ముఖ్యమంత్రి తన నివాసంలో సమీక్షించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వున్న బహిరంగ ప్రదేశాలు, ఉద్యాన వనాలు, కాలువలు, నదీ అభిముఖ ప్రదేశాలు, జలాశయాలు, రహదారులు, మీడియన్లలో ఏపియూజిబిసి చేపట్టిన సుందరీకరణ పనుల గురించి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ చంద్రమోహన్‌రెడ్డి ముఖ్యమంత్రికి ప్రజంటేషన్ ఇచ్చారు. పట్టణ ప్రాంత సుందరీకరణ కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇంత పెద్దఎత్తున ప్రాజెక్టులను చేపట్టిన రాష్ట్రం దేశంలో ఏపి ఒక్కటేనని చెప్పారు. ‘అమృత్’ సుందరీకరణ పనులపై కేంద్రం ఇటీవల జరిపిన సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించి దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇదే తరహా విధానాన్ని అనుసరించాలని సూచించిందని పురపాలక శాఖ డైరెక్టర్ కన్నబాబు తెలిపారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ, నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి, పుట్టపర్తి, పట్టిసీమ ప్రాంతాల్లో 11 విశ్వవిద్యాలయాలు, 15 ఆసుపత్రుల్లో కార్పొరేషన్ చేపట్టిన మొత్తం 326 ప్రాజెక్టులు వివిధ దశల్లో వున్నాయని ప్రెజెంటేషన్‌లో వివరించారు. పట్టిసీమలో 185 ఎకరాల్లో చేపట్టిన సుందరీకరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రానున్న కాలంలో అక్కడ మ్యూజియం, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారికి ఇష్టమైన పసుపు, ఎర్ర వర్ణం గల పుష్పజాతులతో అందమైన పూదోటను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. శ్రీశైలం కొండ మార్గంలో పాదచారుల కోసం ఆకర్షణీయంగా ఉండేలా నడక మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. విజయవాడను కాలువల నగరంగా, తిరపతిని సరస్సుల నగరంగా, విశాఖను బీచ్ నగరంగా మరింత సుందరంగా అభివృద్ధి చేసి పర్యాటక అకర్షణీయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇస్రో అందించే ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పట్టణాలు, నగరాల్లో గ్రీనరీని ఎప్పటికప్పుడు అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పచ్చిక బయళ్లు, తోటలు, పెరటి చెట్లు, మొక్కల పెంపకం, ఇంటి ఆవరణలో చెట్లు, గృహాలంకరణలో భాగంగా పంచే చెట్లు, బోన్సాయ్ వృక్షాలు, నర్సరీలు, రూఫ్ గార్డెన్లు, వర్టికల్ గార్డెన్లు, ఫ్లోరీ కల్చర్, ఇరిగేషన్, పెస్టు మేనేజ్‌మెంట్ తదితర అంశాల్లో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. ఈ రంగంలో స్టార్టప్స్‌కు ఊతమివ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా చెప్పారు. ఈ అంశాల్లో ఎంటర్‌ప్రెన్యూర్లను ప్రోత్సహించేలా ఒక విధానాన్ని రూపొందించాలని సూచించారు. గృహిణులకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు కల్పించడం వల్ల అటు గ్రీనరీని అభివృద్ధి చేయడంతోపాటు కుటుంబ వికాసానికి దోహదం చేయవచ్చునని అన్నారు. వీటి కోసం త్వరలో వెబ్ పోర్టల్, మొబైల్ ఆప్లికేషన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.