కృష్ణ

భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి శతజయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, మార్చి 17: భారతరత్న, పద్మవిభూషణ్, ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు ఎమ్‌ఎస్ సుబ్బులక్ష్మి శతజయంతి ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కర్ణాటక కల్చరల్ ఆధ్వర్యంలో నూపుర ఫైనార్ట్స్ అకాడమీ బెంగుళూరు ఆధ్వర్యంలో శుక్రవారం నాట్యక్షేత్రం కూచిపూడిలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పి కశ్యప, గురురాజ్, డా ఏలేశ్వరపు శ్రీనివాసులు కూచిపూడి నృత్యాలు సోనియా పోడువల్ భరతనాట్య ప్రదర్శనను ప్రేక్షకులను మైమరపించాయి. కళామండలి కార్యదర్శి పశుమర్తి కేశవప్రసాద్ కళాకారులను, నాట్యాచార్యులను ఘనంగా సత్కరించారు. అంతకు ముందుగా ఎమ్‌ఎస్ సుబ్బులక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అమెరికాలో భారతీయులకు రక్షణ కల్పించాలి

మైలవరం, మార్చి 17: అమెరికాలో ఉన్న భారతీయులకు రక్షణ కల్పించాలని శుక్రవారం మైలవరం పట్టణంలో మహాత్మాగాంధీ గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన నిర్వహంచారు. స్థానిక మహాత్మాగాంధీ గ్రంథాలయం నుండి పుర వీధుల్లో ఈ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక బోసుబొమ్మ సెంటరులో, స్థానిక దళిత చైతన్య వేదిక వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కమిటీ చైర్మన్ పివి ఆంజనేయులు, కన్వీనర్ ఎండి జాని మాట్లాడుతూ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమెరికాలో ఉన్న ఇండియన్స్‌కు రక్షణ కరవైందని ఆరోపించారు. అమెరికాలో భారతీయుల రక్షణపై భారత ప్రభుత్వం స్పందించి, అమెరికా అధ్యక్షునితో మాట్లాడి ఎన్నారైలకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. ఈకార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రావూరి రామారావు, రైతు సంఘ కార్యదర్శి వజ్రాల వెంకటరెడ్డి, అభయ, యువ షెడ్యూలు కులాల, తెగల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అన్నపరెడ్డి జమలయ్య, మోహనరావు, డొంకెన చలపతిరావు, అల్లాభ, పలువురు స్థానికులు పాల్గొన్నారు.