కృష్ణ

కార్పొరేషన్ దిశగా బందరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 19: కళలకు కాణాచి, పోరాటాలకు పురిటి గడ్డ అయిన మచిలీపట్నంకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే బందరు ఓడరేవు నిర్మాణానికి మార్గం సుగమం అవుతున్న నేపథ్యంలో చారిత్రక, పురాతన మచిలీపట్నం పురపాలక సంఘం కార్పొరేషన్‌గా అవిర్భవించేందుకు సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా మచిలీపట్నం జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ ఎదుగూబొదుగూ లేకుండా పోయింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా మచిలీపట్నం పెద్ద పల్లెటూరి మాదిరిగా మారిపోయింది. రాష్ట్ర విభజన పుణ్యమా అంటూ ఈ ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతి చేరువలో ఉన్న మచిలీపట్నం అభివృద్ధిపై ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పట్టణాన్ని వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు ఓడరేవు నిర్మాణంపై దృష్టి సారించారు. 5వేల ఎకరాల్లో ఓడరేవు నిర్మాణానికి సంసిద్ధమైన ప్రభుత్వం అందుకు అవసరమైన భూముల సమీకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. 5వేల ఎకరాల్లో 3వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములే ఉండటంతో పోర్టు నిర్మాణం పట్ల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఎన్నికల హామీలకే పరిమితమైన పోర్టు నేడు పట్టాలెక్కబోతున్న ఆనందంలో పట్టణ ప్రజలు ఉన్నారు. పోర్టుకు అవసరమైన భూముల సర్వేను పూర్తి చేసిన రెవెన్యూ అధికారులు సోమవారం కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం 42 వార్డులు, లక్షా 70వేల మంది జనాభా కలిగిన మచిలీపట్నం పురపాలక సంఘం త్వరలో తన పరిధిని మరింత విస్తరింప చేసుకోనుంది. ఆ దిశగా కూడా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పురపాలక సంఘానికి అనుకుని మూడు కిలో మీటర్ల పరిధిలో ఉన్న 15 గ్రామ పంచాయతీలను విలీనం చేసి కార్పొరేషన్‌గా మార్పు చేసేందుకు మున్సిపల్ శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రాష్ట్రంలో జిల్లా కేంద్రాలుగా ఉన్న మచిలీపట్నం, శ్రీకాకుళం, విజయనగరం మున్సిపాల్టీలను కార్పొరేషన్‌లుగా మార్పు చేస్తూ గతంలోనే ప్రభుత్వం జివో జారీ చేసింది. అయితే ఈ జివో వల్ల ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలు రద్దయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పాలకవర్గాల పదవీ కాలం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో మళ్లీ ప్రభుత్వం కార్పొరేషన్‌ల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఇదిలా ఉండగా గత పురపాలక సంఘ ఎన్నికలకు ముందు జిల్లాలో తిరువూరు, ఉయ్యూరు, నందిగామ గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్పు చేస్తూ ఎన్నికలు నిర్వహించారు. త్వరలో జరగనున్న ఎన్నికల నాటికి మరో ఐదు నగర పంచాయతీలు ఏర్పడనున్నాయి. అవనిగడ్డ, కైకలూరు, పామర్రు, విస్సన్నపేట, మైలవరం గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్పు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్బనలైజేషన్‌లో భాగంగా ఈ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.

పిడుగుపాటుకు మహిళ మృతి
గుడ్లవల్లేరు, మార్చి 19: పిడుగు పాటుకు మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం మండల పరిధిలోని కౌతవరం గ్రామంలో చోటు చేసుకుంది. అకాల వర్షం కురవడంతో నక్కబుడ్డి పాప (24), ఆమె భర్త నాగరాజు కుప్ప వేసిన మినుము పంటను పరదాలతో రక్షిస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో పాప అక్కడికక్కడే మృతి చెందగా కౌలు రైతు నాగరాజు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నాగరాజును ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.