కృష్ణ

సుబాబుల్ రైతుల చలో రాజధాని పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, మార్చి 20: ఎస్‌పిఎం బకాయిలను మార్కెట్ కమిటీల ద్వారా చెల్లించాలని డిమాండ్ చేస్తూ సుబాబుల్ రైతులు స్థానిక మార్కెట్ యార్డ్ నుండి రాజధాని అమరావతికి చేపట్టిన పాదయాత్రను సోమవారం పోలీసులు అడ్డుకున్నారు. ఎస్‌పిఎం కంపెనీ 285మంది సుబాబుల్ రైతులకు రూ.10కోట్ల 30 లక్షలకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సమస్యపై పలు మార్లు సుబాబుల్ రైతులు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. సోమవారం నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు చెందిన రైతులు రాజకీయాలకు అతీతంగా రాజధాని అమరావతికి నందిగామ మార్కెట్ యార్డ్ నుండి పాదయాత్ర చేయాలని సంకల్పించారు. సుమారు 300మంది రైతులు మార్కెట్ యార్డ్‌కు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఒకొక్క రైతుకు రూ.5నుండి 9లక్షల వరకూ ఎస్‌పిఎం కంపెనీ చెల్లించాల్సి ఉండగా తాము ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తన్నట్లు వ్యవహరిస్తోందని రైతులు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుబాబుల్ రైతు సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేసిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేడు తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదన్నారు. బకాయిలు రాకపోవడంతో పిల్లల చదువులు, వివాహాలు ఆగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టన్నవరానికి చెందిన రైతు చలమల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్‌పిఎం కంపెనీ నుండి తనకు రూ.11లక్షలు రావాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. మరో రైతు నంబూరి సురేష్ తనకు రూ.5లక్షలు రావాల్సి ఉందని, ఆరేళ్లుగా పంట కూడా నష్టపోవడం జరుగుతోందన్నారు. రైతు నాయకుడు యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ సెంట్రల్ మార్కెటింగ్ ఫండ్ ద్వారా సుబాబుల్ రైతు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
మూడు వారాల గడువు కోరిన డిఎస్‌పి
మూడు వారాల్లో ఎస్‌పిఎం కంపెనీ ప్రతినిధులను అరెస్టుచేసి వారి నుండి బకాయిలను చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని, పాదయాత్ర విరమించుకోవాలని డిఎస్‌పి ఉమామహేశ్వరరావు సుబాబుల్ రైతులకు విజ్ఞప్తి చేశారు. డిఎస్‌పి హామీతో రైతులు ఆందోళన విరమించారు. తాము ఇప్పటి వరకూ ఎస్‌పిఎం కంపెనీ ప్రతినిధులను అరెస్టు చేయడానికి రెండు పర్యాయాలు ఢిల్లీ వెళ్లామని, అయితే వారు అందుబాటులో లేరన్నారు. మంత్రుల ఆదేశాల మేరకు వారిని త్వరలోనే అరెస్టు చేసి రైతుల ముందుకు తీసుకువస్తామని డిఎస్‌పి తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కెవి సాంబశివరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు, యార్డ్ కార్యదర్శి గోవిందు మాట్లాడుతూ సుబాబుల్ రైతుల బకాయిల చెల్లింపుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని, సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సైతం తీసుకువెళ్లామని, సిఎం కూడా సానుకూలంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుబాబుల్ రైతులు తుమ్మల నాగేశ్వరరావు, ముండ్లపాటి రాము, బండి కోటేశ్వరరావు, నల్లాని సాయి, గడుపూడి సతీష్, చెరుకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

డెల్టాలో మంచినీటి సమస్య ఏర్పడినందుకు పాలకులు సిగ్గుపడాలి
* రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని
కృత్తివెన్ను, మార్చి 20: డెల్టాలో మంచినీటి కోసం ఉద్యమాలు చేసే పరిస్థితిని తీసుకువచ్చినందుకు పాలకులు సిగ్గుపడాలని రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రం అన్నారు. శివారు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరాను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎర్నేని మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహించే కృష్ణాజిల్లాలో మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధర్నా అనంతరం తహశీల్దార్ భరత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆఖిలపక్ష నాయకులు మోదుమూడి రామారావు, భూపతిరాజు, సురేష్ బాబు, తమ్ము ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.