కృష్ణ

ఆత్మహత్యలకు స్వస్తి చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 23: ఎట్టకేలకు ప్రభుత్వం ఇచ్చిన హామీతో అగ్రిగోల్డ్ బాధితుల నిరవధిక దీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఆ సంస్థ వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని, యాజమాన్యం అవ్వాస్ సోదరులను అరెస్టు చేయాలని, డిపాజిట్లు తిరిగి తమకు చెల్లించాలని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6న అలంకార్ సెంటర్ ధర్నాచౌక్‌లో దీక్షలు ప్రారంభమై 18 రోజులుగా జరుగుతున్నాయి. వివిధ రూపాలు, వివిధ ప్రదేశాల్లో సాగిన ఈ దీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో ముగించారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు నేతృత్వంలో సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ సహకారంతో నగరంలో దీక్షలు కొనసాగాయి. అసోసియేషన్ పిలుపుతో రాష్ట్రం నుండి, ఇతర ఏడు రాష్ట్రాల నుండి కూడా బాధితులు పెద్దసంఖ్యలో వచ్చి దీక్షల్లో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ దీక్షలకు టిడిపి మినహా ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. రెండు రోజులుగా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల నేతలు అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళనను సభ దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దిగిరాక తప్పలేదన్నారు. సిఎం ఇచ్చిన హామీలతో సంతృప్తి చెందిన అసోసియేషన్ నాయకులు ఈవిషయాన్ని దీక్షాపరులకు తెలిపి దీక్షలను విరమింపచేశారు. పోరాటం విజయవంతం కావడానికి సహకరించిన అన్ని పార్టీలకు, ప్రజాసంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం కార్యదర్శి పి మధు తదితర పార్టీలకు చెందినవారు పాల్గొన్నారు. దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమించినట్లు ప్రకటించారు. తొలుత ప్రజానాట్యమండలి నాయకులు ఆర్ పిచ్చయ్య విజయోత్సవ గీతాలను ఆలపించి బాధితులను ఉత్తేజపరిచారు.

రూ. 10లక్షల విలువైన గంజాయి స్వాధీనం
* ఏడుగురు నిందితుల అరెస్టు
* స్కోడా కారు స్వాధీనం
విజయవాడ (క్రైం), మార్చి 23: గంజాయి పట్టివేత కేసులో ఏడుగురు నిందితులను టాస్క్ఫోర్స్, భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు పది లక్షలు విలువైన 200 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి జి పాలరాజు తెలిపారు. తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖ జిల్లా పెదబైరు ట్రైబల్ ప్రాంతానికి చెందిన గడుతూరి భాస్కరరావు, సాంగ్ వెంకటరమణ, కాంతరి భాస్కరరావు అనే ముగ్గురు స్థానికంగా కూలి పనులు చేస్తుంటారు. దీంతోపాటు మరోవైపు అటవీ ప్రాంతంలో గంజాయి సేకరించి ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లి లాభానికి విక్రయిస్తుంటారు. వీరిపై గతంలో కూడా గంజాయి కేసులతోపాటు ఇతర కేసులు కూడా ఉన్నాయి. ఈక్రమంలో కారుడ్రైవర్ ఐతి మహేష్‌బాబు, వరంగల్ జిల్లాకు చెందిన అరుగుల రాము, గోవింద్ యాదవ్ ప్రసాద్‌లతో బేరం కుదుర్చుకుని నిజామాబాద్ పరకాలకు గంజాయి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈక్రమంలో ఈనెల 20న విశాఖపట్నం ట్రైబల్ ఏరియాలో సుమారు 200 కేజీల గంజాయితో బయలుదేరారు. మార్గమధ్యలో పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు వద్ద కారు రోడ్డు ప్రమాదానికి గురి కాగా వెంటనే అదే జిల్లాకు చెందిన కేత శ్రీనివాసరావు అనే వ్యక్తి సాయంతో మరో కారులో కిరాయికి మాట్లాడుకుని నిజామాబాద్ తరలించే క్రమంలో విజయవాడ చేరుకున్నారు. ఇక్కడ సరుకును మరొక కారులోకి మార్చే ప్రయత్నంలో సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్ ఏసిపి ప్రసాద్ నేతృత్వంలో ఎస్‌ఐ శ్రీనివాస్ సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. దీంతో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని 200 కేజీల గంజాయితోపాటు స్కోడా కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డిసిపి పాలరాజు తెలిపారు. విలేఖరుల సమావేశంలో టాస్క్ఫోర్స్ ఏసిపి ప్రసాద్, వెస్ట్ ఏసిపి గుణ్ణం రామకృష్ణ, సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.