కృష్ణ

31న అజ్మీర్‌కు మచిలీపట్నం నుండి ప్రత్యేక రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 23: రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రాత్మక ప్రదేశమైన అజ్మీర్‌లోని సూఫి మత గురువు ఖాజా మొయినుద్దీన్ చిష్టి వారి ఉరుసు మహోత్సవాలకు జిల్లా కేంద్రం మచిలీపట్నం నుండి ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం జరిగిందని పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు ఈ నెల 31వతేదీ రాత్రి 10.45ని.లకు బందరు నుండి బయలుదేరి ఏప్రిల్ 1వతేదీ రాత్రి 9.30 నిముషములకు అజ్మీర్ చేరుతుందన్నారు. ఈ రైలు సౌకర్యాన్ని మచిలీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపి కొనకళ్ల నారాయణరావు కోరారు.

ఏప్రిల్‌లోగా
నిర్వాసితులందరికీ నివేశన స్థలాలు
* నియోజకవర్గ టిడిపి సమన్వయకమిటీ సమావేశంలో మంత్రి ఉమ
మైలవరం, మార్చి 23: ఏప్రిల్ నెలాఖరులోగా మైలవరం నియోజకవర్గంలోని నిర్వాసితులందరికీ నివేశన స్థలాలు పంపిణీ చేస్తామని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మం త్రి దేవినేని ఉమామహేశ్వరరావు హా మీ ఇచ్చారు. మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకమిటీ సమావేశం గురువారం ఇరిగేషన్ కార్యాలయంలో జరిగింది. ఈసమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యం గా మైలవరం, కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలతోపాటు 221 జా తీయ రహదారికి ఇరువైపులా ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు కోల్పోయిన వారికి ఏప్రి ల్ నెలాఖరులోగా ఇళ్ళ స్థలాలు పం పిణీ చేస్తామన్నారు. వెంటనే ఆయన సబ్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఇళ్ళ స్థలాల సమస్యను పరిష్కరించాలన్నా రు. అదేవిధంగా ఎన్టీఆర్ గృహకల్ప పధకం కింద మంజూరైన ఇళ్ళ నిర్మాణాలను అందరూ త్వరితగతిన పూర్తి చేసే విధంగా నేతలు చర్యలు చేపట్టాలన్నారు. కట్టడాల పరిమితిని 5వందల నుండి 600 వరకూ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్టీఆర్ భరోసా, వృద్ధాప్య పింఛన్లను 60 ఏళ్ళు నిండిన వారందరికీ అందే విధంగా చర్యలు తీ సుకోవాలన్నారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి పనికి సంబంధించి వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశంలో చర్చించారు. ప్రధాన్యతాక్రమం లో అభివృద్ధి పథకాలన్నీ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
20వ వార్డు ఉప ఎన్నిక ‘టిడిపి’కే
* నామినేషన్‌లు దాఖలు చేయని ప్రతిపక్షాలు
పెడన, మార్చి 23: స్థానిక 20వ వార్డు ఉప ఎన్నికకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దివంగత చైర్మన్ యర్రా శేషగిరిరావు కుమారుడు యర్రా నాగరాజు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నాగరాజుతో పాటు ఆయన భార్య దుర్గా భవాని నామినేషన్ వేశారు. వీరి ఇరువురితో పాటు కారుపర్తి హరి శ్రీరామచంద్రమూర్తి ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశాడు. అయితే నామినేషన్ల స్వీకరణ సమయం ముగిసిన తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ పత్రాలను పరిశీలించగా ఇరువురు సాక్షి సంతకాల్లో ఒకరిది మాత్రమే ఉండటంతో సంబంధిత నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో భార్యాభర్తలు యర్రా నాగరాజు, దుర్గా భవాని నామినేషన్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ హన్ను, టిడిపి నాయకులు బొల్లా వెంకన్న, చందన నారాయణరావు, ఊటుకూరి మోహనరావు, తోట పైడేశ్వరరావు, పడవల పైడేశ్వరరావు తదితరులు రాజా నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.

శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్‌ను సీజ్ చేసిన డిఇఓ
* అక్షయ మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు
కృత్తివెన్ను, మార్చి 23: బస్సుడ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృతికి కారణమైన లక్ష్మీపురం శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్‌ను అధికారులు సీజ్ చేశారు. శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్‌లో యుకెజి చదువుతున్న అక్షయ బుధవారం సాయంత్రం స్కూల్‌బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు స్కూల్ ఎదుట మృతదేహంతో బైఠాయించి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన జిల్లా విద్యా శాఖాధికారి ఎ సుబ్బారెడ్డి, బందరు ఆర్డీవో పి సాయిబాబు, జెడ్పీ ఇన్‌ఛార్జ్ సిఇఓ ఎన్‌వివి సత్యనారాయణ గురువారం ఉదయం గ్రామస్థులతో చర్చలు జరిపారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దీనిపై డిఇఓ సుబ్బారెడ్డి పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సదరు పాఠశాలను సీజ్ చేశారు. ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 6, 7 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను లక్ష్మీపురం జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎంఇఓ కమలకు ఆదేశాలు జారీచేశారు. బందరు డియస్పీ శ్రావణ కుమార్, తాలుకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మూర్తి స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వటంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించేందుకు సహకరించారు.

ఉపఎన్నికల్లో టిడిపి రెబల్

19వ వార్డు టిడిపి అభ్యర్థిగా నండూరి నామినేషన్
గుడివాడ, మార్చి 23: స్థానిక 19వ వార్డు ఉప ఎన్నికకు టిడిపి అభ్యర్థిగా నండూరి వీరవెంకట ప్రసాద్ గురువారం ఎన్నికల అధికారి బండి శేషన్నకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందుగా సత్యనారాయణపురంలోని నండూరి ఇంటి దగ్గర నుండి భారీ ఊరేగింపుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తూర్పు కృష్ణాడెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుత్తా చంటి, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి తదితరులు నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని మాట్లాడుతూ ఈ ఉప ఎన్నిక అరాచకం, అభివృద్ధికి మధ్య పోటీగా నిలిచిందన్నారు. 19వ వార్డులో టిడిపి విజయం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లింగం ప్రసాద్, కిలిమి వెంకటరెడ్డి, శొంఠి రామకృష్ణ, పి కృష్ణారావు, పి ఏసుబాబు, వెంపల హైమావతి, మేరుగు మరియకుమారి, మెరుగుమాల మేరీసంతోషం, వసంతవాడ దుర్గారావు, షేక్ బాజీభాషా, పెనుమూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నివాసాల మధ్య మద్యం దుకాణాలు వద్దంటూ
శ్రీనగర్ కాలనీ వాసుల ధర్నా
చల్లపల్లి, మార్చి 23: నివాస గృహాల మధ్య మద్యం దుకాణాలను ఏర్పాటు చేయవద్దంటూ పాగోలు శ్రీనగర్ బిసికాలనీ వాసులు ఆందోళనకు దిగారు. గురువారం మధ్యాహ్నం కాలనీవాసులు నడకుదురు రోడ్డులో బైఠాయించి కొద్దిసేపు రాస్తారోకో చేశారు. మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేసి తమ నిరసనను తెలియజేశారు. అధికారులు తక్షణం స్పందించి నివాస గృహాల సమీపంలో ఏర్పాటు చేయనున్న నాలుగు మద్యం దుకాణాలను నిలువరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రదర్శనగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహశీల్దార్ భిక్షారావుకు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన తహశీల్దార్ విషయాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు.