కృష్ణ

టిడిపి రెబల్ అభ్యర్థి నామినేషన్ తిరస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, మార్చి 24: స్థానిక 19వ వార్డు ఉప ఎన్నికకు సంబంధించి టిడిపి రెబల్ అభ్యర్థి పరసా నరేష్‌మోహన్ నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించిందని ఎన్నికల అధికారి బండి శేషన్న చెప్పారు. పరసా తన నామినేషన్‌ను స్వయంగా ఎన్నికల అధికారికి అందజేయలేదని, ప్రపోజల్స్ లేరని, సంతకం అతనిది కాదని టిడిపి నాయకులు శుక్రవారం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళడంతో రాత్రి 8గంటల ప్రాంతంలో పరసా నామినేషన్‌ను తిరస్కరించినట్టుగా సమాచారం వచ్చింది. ఇదిలా ఉండగా వైసీపి అభ్యర్థిగా గణపతి సూర్యనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థిగా కూరేటి శ్యామ్‌కుమార్, టిడిపి అభ్యర్థిగా నండూరి వీరవెంకట ప్రసాద్, టిడిపి డమీ అభ్యర్థిగా పంచుమర్తి శ్రీనివాసరావులు దాఖలు చేసిన నామినేషన్లను ఆమోదిస్తున్నట్టు ఎన్నికల అధికారి బండి శేషన్న తెలిపారు. శనివారం ఉప సంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని ఎన్నికల అధికారి శేషన్న చెప్పారు.
16,700 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీకి చర్యలు
* జెడి మోహనరావు
అవనిగడ్డ, మార్చి 24: జిల్లాలో 16,700 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ జెడి సాళ్లూరి మోహనరావు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేఖర్లతో మాట్లాడుతూ భూసారాన్ని పెంపొందించేందుకు రైతులు పచ్చిరొట్ట సాగు చేయాలని సూచించారు. ఏప్రిల్ నుండి రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై ఇచ్చేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. జీలుగ విత్తనాలు 70శాతం రాయితీపై అందిస్తున్నామన్నారు. కిలో జీలుగ విత్తనాలు రూ.40 ఉండగా రూ.30 రాయితీ ఇస్తున్నామని, రైతు రూ.10 చెల్లిస్తే సరిపోతుందన్నారు. జనుము కిలో రూ.56 ఉండగా సబ్సిడీ రూ.42 పోను రూ.14లకు, పిల్లిపెసర కిలో రూ.114 ఉండగా రూ.85.35పైసల రాయితీపోను రూ.28 రూపాయలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జెడి తెలిపారు. రైతులు పచ్చిరొట్ట సాగు చేసి భూసారాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

గుడివాడ-్భమవరం రైల్వే డబ్లింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేస్తాం
* ఎడిఆర్‌ఎం వేణుగోపాలరావు
గుడివాడ, మార్చి 24: గుడివాడ-్భమవరం రైల్వే డబ్లింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని సౌత్‌సెంట్రల్ రైల్వే ఎడిఆర్‌ఎం వేణుగోపాలరావు చెప్పారు. శుక్రవారం స్థానిక రైల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు విలేఖర్లతో మాట్లాడుతూ డబ్లింగ్ పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచామన్నారు. గుడివాడ-్భమవరం, భీమవరం-నిడదవోలు, గుడివాడ-మచిలీపట్నం, విజయవాడ-గుడివాడ, భీమవరం-నరసాపురంలకు వేర్వేరుగా పనులు జరుగుతున్నాయన్నారు. గుడివాడ-్భమవరం మధ్యలో 50కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయన్నారు. 2019నాటికి డబ్లింగ్ పనులు పూర్తవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎసిఎం సోమశేఖర్‌నాయుడు, రైల్వే ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ పి శేషగిరిరావు, స్టేషన్ మేనేజర్ పి గాంధీ తదితరులు పాల్గొన్నారు.