కృష్ణ

నాట్యారామానికి పొలాలివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, మార్చి 24: కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు, ఈ నాట్యాన్ని భావితరాల వారికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కూచిపూడిలో తలపెట్టిన నాట్యారామం నిర్మాణానికి వ్యవసాయ భూములు ఇచ్చేది లేదంటూ రైతులు స్పష్టం చేశారు. శుక్రవారం కూచిపూడి కళాపీఠంలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశానికి ఆర్డీవో పి సాయిబాబు, బి రామ్‌నాయక్, ఆర్‌ఐ ఎ శ్రీనివాసరావు, సర్వేయర్ డి శ్రీనివాస్ వచ్చారు. నాట్యారామం నిర్మాణానికి 56 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖ గుర్తించింది. ఈ భూములపై రైతులతో చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో చిన్న, సన్నకారు రైతులమైన తాము భూములను నాట్యారామానికి ఇచ్చేది లేదంటూ రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం అధిక ధరలు చెల్లిస్తుందని ఆర్డీవో నచ్చచెప్పబోగా రైతులు వ్యవసాయ భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. ఇందులో 42 ఎకరాలకు చెందిన 36 మంది రైతులతో పాటు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి ఆలయానికి చెందిన 14 ఎకరాలు కూడా ప్రభుత్వం నాట్యారామ నిర్మాణానికి గుర్తించింది. దీనిపై రైతుల అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కావూరి భానుమూర్తి, మాజీ ఎంపిటిసి డా.వి విష్ణువర్థనరావు, మాజీ ఎఎంసి చైర్మన్ చీకటిమర్ల శివరామప్రసాద్, మాజీ సర్పంచ్ వైకెడి ప్రసాదరావు, పలువురు రైతులు పాల్గొన్నారు.

తెలుగువారి చరిత్రకు శాసనాలే సాక్ష్యాధారాలు
* శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్
విజయవాడ (కల్చరల్), మార్చి 24: మహోన్నత తెలుగు చరిత్ర సంస్కృతికి శాసనాలు మూలాధారాలనీ, అలాంటి శాసనాలను కాపాడుకోవడం ప్రతి తెలుగువాడి విధి అని, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ రాసిన తెలుగు సంస్కృతి, శాసనాలు, చారిత్రక పరిణామాలు అన్న గ్రంథాన్ని శుక్రవారం ఆవిష్కరించిన శాసనసభ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ అన్నారు. కొమర్రాజు లక్ష్మణరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ ఒరవడిలో శాసనాలను పరిశోధించి, కొన్నవేల శాసనాల్లో ఉన్న తెలుగువారి సంస్కృతి, విన్యాసాన్ని విశే్లషించారన్నారు. విశిష్ట అతిధిగా పాల్గొన్న సాంస్కృతిక శాఖామంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ క్రీ.శ. 6వ శతాబ్దికే తేటతెలుగులో శాసనాలు వచ్చయని, మన సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు అవి అద్దం పడుతున్నాయని, రచయిత గంగిశెట్టిని అభినందించారు.